Gold worth 6 billion dollar discovered: టర్కీకి పండగే పండగ.. బయటపడ్డ భారీ బంగారు నిక్షేప కేంద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద గనిగా గుర్తింపు..
టర్కీలో భారీ బంగారు గని బయట పడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గని అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బంగారం నిక్షేపంలో దాదాపు
Gold worth $6 billion discovered: టర్కీలో భారీ బంగారు గని బయట పడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గని అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బంగారం నిక్షేపంలో దాదాపు 99 టన్నుల బంగారం ఉంటుందని ఆదేశ భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే దాని విలువ సుమారుగా 6 బిలియన్ల డాలర్లు ఉంటుందంట. అదే మన భారత కరెన్సీలో చూసుకున్నట్లయితే రూ.44వేల కోట్లు అనమాట. ఇంత భారీ స్థాయిలో బంగారు గని బయటపడంతో ఇప్పుడు అందరి కళ్లు దానిపైనే పడ్డాయి. కాగా, బంగారు నిక్షేపాన్ని టర్కీ దేశ వ్యవసాయ సహకార సంస్థ, ఎరువుల తయారీ సంస్థ గ్యూబెర్టాస్ సంయుక్తగా వెలుగులోకి తీసుకువచ్చాయి. ఇదిలా ఉంటే.. బంగారు నిక్షేపాల వల్ల వచ్చే ఆదాయం.. ప్రపంచంలోని పలు దేశాల డీజీపీతో సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా టర్కీకి పండగే పండగ అని చెప్పాల్సిందే.
Also read:
ఆకట్టుకుంటోన్న ‘రంగ్ దే’ న్యూలుక్… పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన నితిన్.
జక్కన చెక్కుతున్న శిల్పం.. తెలుగు నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న బాలీవుడ్ బ్యూటీ