NASHVILLE EXPLOSION: అమెరికాలోని నాశ్‌విల్లేలో భారీ పేలుడు.. కావాలనే బాంబ్ బ్లాస్ట్ చేశారని తేల్చిన భద్రతా సిబ్బంది..
క్రిస్మస్ పర్వదినం.. తెల్లవారు జామున 6.30 అవుతోంది. డౌన్‌టౌన్ వాసులంతా క్రిస్మస్ సంబరాల మూడ్‌లో ఉన్నారు. ఇక అంతకు మించి...
NASHVILLE EXPLOSION: క్రిస్మస్ పర్వదినం.. తెల్లవారు జామున 6.30 అవుతోంది. డౌన్‌టౌన్ వాసులంతా క్రిస్మస్ సంబరాల మూడ్‌లో ఉన్నారు. ఇక అంతకు మించి ఆ ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతం. నాశ్‌విల్లేకి గుండెకాయ లాంటి డౌన్‌టౌన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవంతులు అదిరిపోయాయి. చాలా ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతం అంతా నల్లని పొగ కమ్ముకుంది. ఏం జరిగిందా అని అంతా బయటకు వచ్చి చూస్తే ఓ కారు మంటల్లో చిక్కుకుని ఉంది. భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. భయాందోళనతో ప్రజలు ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
అయితే, పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించినట్లు నాశ్‌విల్లే అధికారులు ప్రకటించారు. ఈ ఘటన కారణంగా పలు బిల్డింగ్‌లు పాక్షికంగా ద్వంసమయ్యాయన్నారు వెల్లడించారు. అయితే ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇదిలాఉంటే. నాశ్‌విల్లే పోలీసులు ఈ పేలుడు గురించి కీలక విషయాలు వెల్లడించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా దుండగులు కావాలనే ఈ చర్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ బ్లాస్టింగ్‌కు పాల్పడిన దుండగులను పట్టుకునే పనిలో నాశ్‌విల్లే పోలీసులు ఉన్నారు.
పేలుడు సంభవించిన ప్రాంతంలో నివసిస్తున్న బక్ మెక్కాయ్.. ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రజల అరుపులు, కేకలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మెక్కాయ్ ఇంటి కిటికీ సైతం పేలుడు ధాటికి పగిలిపోయాయి.