భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కలర్‌ఫుల్‌గా ప్రారంభమయ్యింది. చారిత్రాత్మక నగరమైన ఫిలాడెల్ఫియా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘనస్వాగతం లభించింది. క్వాడ్ సదస్సుకు హాజరవుతారు మోదీ. ఆదివారం(సెప్టెంబర్ 22) న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఫిలాడెల్ఫియా ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెలకమ్ లభించింది. ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు మోదీ.. వాళ్లిచ్చిన బహుమతులను స్వీకరించారు. డెలావర్‌లో జరిగే క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు.
మూడు రోజుల పాటు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. డ్రోన్ డీల్‌పై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశముంది. ఈ సదస్సును అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఏర్పాటు చేశారు. ఆదివారం యార్క్‌లో జరిగే ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. దాదాపు 14 వేల మంది ప్రవాస భారతీయులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
#PMModiUSAVisit | PM @narendramodi lands at Philadelphia International Airport in the USA
PM Modi is on a 3-day historic visit to the #UnitedStatesofAmerica.
During the visit, PM will take part in the fourth Quad Leaders’ Summit in Wilmington, Delaware, which is being hosted… pic.twitter.com/03w8fxsNEX
— DD News (@DDNewslive) September 21, 2024
ప్రవాస భారతీయుల సదస్సు ప్రధాన వేదికపై గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలు ప్రదర్శిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సభలో మోదీ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మోదీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు డెమోక్రటిక్ పార్టీ నేతలతో పాటు ఇటు రిపబ్లికన్ పార్టీ నేతలతో మోదీ సమావేశమయ్యే అవకాశముంది. దీనితో పాటు ఆయన తన పర్యటనలో కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..