NTR Shatha Jayanthi Utsavalu: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఘనంగా ప్రారంభం.. ఎన్నికలో టీడీపీ గెలవాలని ఆకాంక్షిస్తున్న నేతలు

|

Jun 19, 2022 | 7:06 PM

సింగపూర్ లో ఘనంగా అన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యకమంలోసినిమా, రాజకీయ రంగాలలో అన్నగారి ఘనవిజయాలు.. తెలుగు వారికి అయన చేసిన సేవ గుర్తు చేసుకొని సభికులు ఆనందించారు. యావత్ సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో మారుమ్రోగింది.

NTR Shatha Jayanthi Utsavalu: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఘనంగా ప్రారంభం.. ఎన్నికలో టీడీపీ గెలవాలని ఆకాంక్షిస్తున్న నేతలు
Ntr Shatha Jayanthi Utsaval
Follow us on

NTR Shatha Jayanthi Utsavalu: ఆంధ్రుల అభిమాన నటుడు.. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి ఉత్సవాలు సింగపూర్ లోని(Singapore) సివిల్ సర్వీస్ క్లబ్ టేసన్ సోన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, కే.ఎస్. జవహర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సినిమా, రాజకీయ రంగాలలో అన్నగారి ఘనవిజయాలు.. తెలుగు వారికి అయన చేసిన సేవ గుర్తు చేసుకొని సభికులు ఆనందించారు. యావత్ సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో మారుమ్రోగింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ దారుణాలు, దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఇక్కడి ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇవ్వగలిగిన నేర్పు, సత్తా చంద్రబాబు నాయుడికే ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని గ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..