Watch: రక్త వాంతులు అవుతున్నాయ్.. చనిపోయేలా ఉన్నా.. సౌదీలో మరో తెలుగు వ్యక్తి దీనగాధ.. స్పందించిన నారా లోకేష్..
ఇతర దేశాలకు వెళితే మంచిగా సంపాదించొచ్చు.. కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు.. అని ఎన్నో కలలతో దేశం కాని దేశం వెళితే.. అక్కడ పరిస్థితులు వేరేలా ఉంటున్నాయి.. ఇక్కడ ఏజెంట్లు చెప్పేది ఒకటి.. అక్కడ జరిగేది మరొకటి.. ఇలా ఏజెంట్ల చేతుల్లో మోసపోయి గల్ఫ్ లేదా ఇతర దేశాలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇతర దేశాలకు వెళితే మంచిగా సంపాదించొచ్చు.. కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు.. అని ఎన్నో కలలతో దేశం కాని దేశం వెళితే.. అక్కడ పరిస్థితులు వేరేలా ఉంటున్నాయి.. ఇక్కడ ఏజెంట్లు చెప్పేది ఒకటి.. అక్కడ జరిగేది మరొకటి.. ఇలా ఏజెంట్ల చేతుల్లో మోసపోయి గల్ఫ్ లేదా ఇతర దేశాలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంటూ ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రాధేయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చాలామంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఏపీకి చెందిన సరెల్ల వీరేంద్రకుమార్ అనే వ్యక్తి వీడియో ద్వారా తన దీన స్థితిని, సౌదీలో తాను పడుతున్న కష్టాలను వివరించాడు. తాను ఓ ఏజెంట్ చేతిలో మోసపోయానని.. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. సౌదీ అరేబియా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెల 10న ఖాతర్ వెళ్లానని.. అక్కడి నుంచి 11వ తేదీన సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారంటూ పేర్కొన్నాడు.. ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నాని.. తనకు రక్త వాంతులు అవుతున్నాయని.. చనిపోయేలా ఉన్నానంటూ వాపోయాడు. తనను రక్షించాలంటూ ఎక్స్ వేదికగా వేడుకున్నాడు. ఈ మేరకు వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
స్పందించిన మంత్రి నారా లోకేశ్.. ఏమన్నారంటే..
ఈ వీడియోను చూసిన ఏపీ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. బాధితునికి భరోసా ఇస్తూ నారా లోకేష్ రీట్విట్ చేశారు. వీరేంద్రా ధైర్యంగా ఉండు.. స్వస్థలానికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది.. అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ హామీ ఇచ్చారు.
వీడియో చూడండి..
Veerendra, we will bring you back home safely! Don’t worry! https://t.co/GKk9j4n64R
— Lokesh Nara (@naralokesh) July 19, 2024
ఇటీవల కూడా కువైట్లో ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం అనుభవిస్తున్న ఓ తెలుగు కార్మికుని దీన గాధను గుర్తించిన మంత్రి నారా లోకేష్.. ఏపీకి తీసుకువస్తామని హామీనిచ్చారు.
కాగా.. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందిస్తూ.. నేనున్నానంటూ హామీనిస్తున్న నారా లోకేష్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..