భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన నుంచి ఆ కంపెనీని వృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు. వినూత్న నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్‌ను ప్రపంచంలో మేటి కంపెనీగా తీర్చిదిద్దుతున్నాడు. 1975లో మైక్రో సాఫ్ట్‌లో చేరిన ఈ తెలుగు తేజం 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు. 2021 ముగింపు దశకు చేరుకోవటంతో మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల సంవత్సరం ఎలా ఉందో పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ” గొప్ప పరిమితుల సమయంలో ప్రజలు ముందుకెళ్లడానికి సాంకేతికతను ఉపయోగించడం కొనసాగిస్తున్నారు. 2021లో మీరు చేసిన దానితో నేను ప్రేరణ పొందాను. రాబోయే కాలంలో మీరు మార్పును కొనసాగిస్తారని ఆశాజనకంగా ఉన్నాను.” అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు.
“ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి 2021 హృదయ విదారకమైన సంవత్సరం అనడంలో సందేహం లేదు. రాబోయే కాలం కోసం నేను ఆశావాదంతో ఉన్నాను. ఎందుకంటే డెవలపర్‌లు, క్రియేటర్‌లు, మార్పు చేసేవారిలో మీ అందరి శక్తిని చూసే అవకాశం ప్రతిరోజూ నాకు ఉంది.” అని వీడియో ద్వారా నాదెళ్ల సందేశామిచ్చారు. “ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవకాశాలను విస్తరించడానికి, తక్కువ సేవలందించే కమ్యూనిటీలకు బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ నైపుణ్యాలను తీసుకురావడానికి సంస్థలు Micosoft సాధనాలను ఉపయోగిస్తున్నాయి.” అని చెప్పారు.
వ్యాక్సిన్‌లు, ఆరోగ్య సంరక్షణకు ఈ సాంకేతికత ఎలా సహాయపడిందో కూడా నాదెళ్ల వివరించారు. సుస్థిరత కోసం చేసిన పని నుంచి తాను ప్రేరణ పొందానని నాదెళ్ల నొక్కిచెప్పారు. ముఖ్యంగా నాదెళ్ల తన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ 2021 కీనోట్ అడ్రస్‌లో హైబ్రిడ్ వర్క్, హైపర్-కనెక్ట్డ్ బిజినెస్, డిజిటల్ బిజినెస్, బిజినెస్ ప్రపంచాన్ని రూపొందించే ఉద్యోగ మార్పిడి వంటి ట్రెండ్‌ల గురించి కూడా మాట్లాడారు. “ఇది హైబ్రిడ్ పనితో కొత్త ప్రపంచంతో ప్రారంభమవుతుంది. మనం ఎలా పని చేస్తాం.. ఎప్పుడు పని చేస్తాం. మన పని ఎక్కడ జరుగుతుంది అనే విషయాలలో మార్పును చూస్తున్నాం” అని సత్య నాదెళ్ల చెప్పారు.
In a time of great constraints, people continue to use technology to help the world overcome. I am inspired by what you have done in 2021, and optimistic that you will continue to drive change in the chapter ahead. pic.twitter.com/7WS1sGLjRv
— Satya Nadella (@satyanadella) December 13, 2021
Read Also.. NRI News: H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త.. EADకి ఆటోమేటిక్ అనుమతి..