ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో..

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..
Indian Expat Woman And Her Daughter Found Dead At Sharjah

Updated on: May 24, 2026 | 9:59 AM

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం..

కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆర్ష (35), తన భర్త నిహాల్‌తో కలిసి షార్జాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. వీరికి ఐదేళ్ల కుమార్తె రుహి (5) ఉంది. ఆర్ష స్వంతంగా ఆన్‌లైన్ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. ఆమె సోదరి కుటంబం కూడా పక్కన ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తన 5 ఏళ్ల కుమార్తెను 22వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు విరిసేసింది. ఆ తర్వాత వెంటనే ఆమె కూడా అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద శబ్ధం రావడంతో సెక్యూరిటీ గార్డ్ వెళ్లి చూసేసరికి ఇద్దరూ రక్తం మడుగులో విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే షార్జా పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసునుపబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించామని షార్జా పోలీసులు గల్ఫ్ న్యూస్‌కు వెల్లడించారు. వీరి మరణాలకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు.

కాగా ఎమిరెట్స్‌లో ఇటీవల కాలంలో భారతీయ మహిళల మరణాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. గతంలోనూ ఓ మహిళ తన బిడ్డతో శవమై కనిపించింది. మరో కేసులో ఓ మహిళ గృహహింస ఆరోపణల నేపథ్యంలో శవమై కనిపించింది. కాగా దక్షిణాసియా కుటుంబాలు అత్యధిక జనాభా సాంద్రతతో నివసించే ప్రాంతాలలో అల్ నహ్దా ఒకటి. ఈ ఎమిరేట్‌లోని సామాజిక సంస్థలు ఇటీవల కాలంలో మానసిక ఆరోగ్యం, గృహ భద్రతపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఈ సంఘటనల తర్వాత గృహ భద్రత, మానసిక ఆరోగ్య సహాయం,సత్వర జోక్యం గురించి అవగాహన కల్పించడం, అలాగే బాధితులను సహాయం కోరడానికి, సామాజిక సహాయ వనరులను పొందడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా ఇండియన్ అసోసియేషన్ షార్జా ‘రైజ్ క్యాంపెయిన్’ను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us