అమెరికా ఎయిర్‌పోర్టు ప్రమాదంలో తనువు చాలించిన తెలుగు వ్యక్తి

|

Apr 04, 2023 | 7:01 AM

అమెరికాలో జరిగిన ఎయిర్‌పోర్ట్‌ బస్సు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. భారత్‌ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్‌ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లి అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్‌లోని లోగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది..

అమెరికా ఎయిర్‌పోర్టు ప్రమాదంలో తనువు చాలించిన తెలుగు వ్యక్తి
Indian-American died in USA
Follow us on

అమెరికాలో జరిగిన ఎయిర్‌పోర్ట్‌ బస్సు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. భారత్‌ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్‌ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లి అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్‌లోని లోగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన విశ్వచంద్‌ కోళ్ల (47) అమెరికాలోని తకెడ ఫార్మాస్యూటికల్‌ సంస్థలో డేటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. భారత్‌ నుంచి వస్తున్న విశ్వచంద్‌ స్నేహితుడైన ఓ సంగీత వాయిద్య కళాకారుడిని మాసాచుసెట్స్‌ రాజధాని బోస్టన్‌ సిటీలోని లోగన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ నుంచి పికప్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు మార్చి 28 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లారు. తన ఎస్‌యూవీ వాహనంలో విమానాశ్రయం బయట టెర్మినల్‌-బి వద్ద వేచి చూస్తున్నారు.

ఈక్రమంలో అటువైపుగా వస్తున్న డార్ట్‌మౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన వాహనం ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ రెండు వాహనాల మధ్య నలిగిపోయి విశ్వచంద్‌ అక్కడికక్కడే మృతి చెండారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్‌ ఉన్నారు. విశ్వచంద్‌ పని చేస్తున్న ఫార్మా సంస్థ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. మరోవైపు విశ్వచంద్‌ స్నేహితులు ‘గో ఫండ్‌ మి’ పేరిట వెబ్‌పేజీని క్రియేట్‌ చేసి ఇప్పటి వరకు 4,06,151 (రూ.3.3 కోట్లు) అమెరికన్‌ డాలర్లు విరాళంగా సేకరించారు. ఈ మొత్తాన్ని మృతుడి కుటుంబానికి అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.