PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) సామాన్యుల జీవితాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లుతోందని విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) అభివర్ణించారు. ఆయన సమర్థవంతమైన పాలనలో దేశంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆస్ట్రేలియా రాజధాని మెల్‌బోర్న్‌లో ఎన్‌ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశ్వ సద్భావన- ఏ జెశ్చర్ ఆఫ్ గుడ్ విల్’ కార్యక్రమంలో మీనాక్షి లేఖి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సంబంధించిన రెండు పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ‘మోడీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’, ‘హార్ట్ ఫెల్ట్: ది లెగసీ ఆఫ్ ఫైత్’ అనే పుస్తకాలను ఆవిష్కరించిన మీనాక్షి.. ప్రధాని పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు.
కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు..
మహారాజా రంజిత్‌సింగ్, మరాఠా రాణి అహల్యా బాయి హోల్కర్‌ల తర్వాత దేశంలో అలాంటి బృహత్తర మార్పు తీసుకురాగల సమర్థత ఎవరికైనా ఉందంటే అది మన ప్రధానమంత్రి నరేంద్రమోడీకే. ఈ విషయంలో ఆయన ఇప్పటికే విజయవంతవయ్యారు. గత 8 సంవత్సరాల పాలనలో మోడీ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేప్టటారు. తద్వారా దేశంలోని ప్రతి సామాన్యుడి జీవితాన్ని స్పృశించేందుకు ప్రయత్నించారు. ఆయన నాయకత్వంలో భారతదేశంలో పలు చారిత్రమాత్మక, విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా, ఈ దేశంలోని సాధారణ పౌరుడికి మరుగుదొడ్లు అవసరమని గుర్తించడానికి ఆయనకు 70 ఏళ్లు పట్టలేదు. అతిక్కువ సమయంలోనే 20 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. ఇక నాలుగు నెలల్లోనే 38 కోట్లమందితో బ్యాంకు ఖాతాలను తెరిపించి ఈ దేశంలోని పేదలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి చేర్చింది కేవలం నరేంద్ర మోడీ మాత్రమే. ఇలా దేశ నిర్మాణంలో సామాన్యుల భాగస్వామ్యులను కృషి చేసేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు ప్రధాని విశేషంగా కృషిచేస్తున్నారు’అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కాగా ఆస్ట్రేలియాలో విశ్వ సద్భావన సభ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆస్ట్రేలియా పార్లమెంట్, సెనేట్ సభ్యులు, కార్పొరేట్ నాయకులు, విద్యావేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు సహా ఆస్ట్రేలియాలో నివాసముండే ప్రముఖ భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..