Flight Tickets: గడచిన అయిదు నెలలుగా పెరుగుతూ వచ్చిన విమాన టికెట్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లోని విమానాశ్రయాల నుంచి యూఏఈ కి వెళ్లే విమానాల టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి. ప్రస్తుతం టికెట్ ధరల గతంలో కంటే సగానికి తగ్గాయి. దేశ రాజధాని డిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే వన్ వే టికెట్ ధర రూ. 14 వేలకు చేరువకు చేరింది. ఒక నెల కిందట ఈ టికెట్ ధర రూ. 40 వేలుగా ఉంది.
డిసెంబర్ 2021 లో ఇండియా- యూఏఈ ఎయిర్ ఫేర్ రూ. 37 వేలను దాటింది. కానీ ఇప్పుడు అది రూ. 13,660 కి చేరింది. దీనిపై యూఏఈ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. అక్టోబర్ లో తాను ప్రయాణించినపుడు టికెట్ కు రూ. 45 వేలు చెల్లించినట్లు చెప్పింది. ప్రస్తుతం ధరల తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసింది.
అసలు విమాన ఛార్జీలు భారీగా పెరగడానికి గల కారణాలను అధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న రెసిడెంట్లకు అనుమతులు ఇవ్వడం, దుబాయ్ ఎక్స్ పో- 2020 వల్ల టూరిస్టుల రాక పెరగడం వంటి కారణాల వల్ల టికెట్లు ధరలు పెరిగాయని చెప్పారు. ప్రయాణికుల తాడికి పెరగడం వల్ల దేశంలోని హైదరాబాద్, కోజికోడ్, కొచ్చి, దిల్లీ నుంచి అప్పట్లో టికెట్ ధర రూ. 40,373 గా ఉంది.
కొవిడ్ -19 మహమ్మారి వల్ల పెరుగుతున్న ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఎయిర్ అరేబియా అబుదాబి.. కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం నుంచి నేరుగా ప్రత్యేక విమానాలను ప్రారంభించింది. గో ఫస్ట్.. ఒక భారతీయ తక్కువ-ధర విమానయాన సంస్థ ఇప్పుడు శ్రీనగర్, షార్జా మధ్య వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది. ప్రస్తుతం దేశంలోకి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ ను కేంద్రం తొలగించడం లాంటి చర్యలు కూడా విమాన ఛార్జీల తగ్గింపుకు కారణంగా మారాయి.
ఇవీ చదవండి..
WhatsApp: వాట్సాప్‌లో ఖతర్నాక్ ఫ్యూచర్ !! మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్ !! వీడియో
MGNREGS: కరోనా తరువాత జాతీయ ఉపాధి హామీ పథకానికి పెరుగుతున్న డిమాండ్.. కానీ..