Indian American Boy: చిన్నారి కాదు చిచ్చరపిడుగు.. ఆన్ లైన్ లో లక్షల విలువజేసే ఫర్నిచర్ ఆర్డర్.. షాక్ తిన్న తల్లిదండ్రులు..

|

Jan 26, 2022 | 2:27 PM

Indian American Toddler: తినడానికి తిండి లేకపోయినా నేటి మానవుడు జీవిస్తాడేమో గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) దానికి ఇంటర్నెట్ (Internet)కనెక్షన్ లేకుండా ప్రస్తుతకాలంలో ఒక్క క్షణం కూడా..

Indian American Boy: చిన్నారి కాదు చిచ్చరపిడుగు.. ఆన్ లైన్ లో లక్షల విలువజేసే ఫర్నిచర్ ఆర్డర్.. షాక్ తిన్న తల్లిదండ్రులు..
Indian American Toddler
Follow us on

Indian American Toddler: తినడానికి తిండి లేకపోయినా నేటి మానవుడు జీవిస్తాడేమో గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) దానికి ఇంటర్నెట్ (Internet)కనెక్షన్ లేకుండా ప్రస్తుతకాలంలో ఒక్క క్షణం కూడా బతకలేదు. అంతగా ఫోన్ జీవితం లో ఒక భాగమైపోయింది. అవును మొబైల్‌ ఒక నిత్యావసరమైపోయింది. మొబైల్‌ లేనిదే క్షణం గడవడం కష్టంగా మారిపోయింది కాలం. ఇటీవల కరోనా పుణ్యమా అని పిల్లలు ఆన్‌ క్లాసుల పేరుతో మొబైల్స్‌, ల్యాబ్‌టాప్‌లకు బాగా కనెక్ట్‌ అయిపోయారు. ఈ క్రమంలో ఓ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 20 నెలల ఈ సిసింద్రీ స్మార్ట్‌ఫోన్‌తో చేసిన పని సోషల్‌మీడియా ప్రపంచంలో వైరల్‌గా మారింది…ప్రవసభారతీయ సంతానమైన ఈ బుడ్డోడు ఇంతకీ ఏం చేశాడో తెలుసా…

న్యూజెర్సీలో నివసిస్తున్న అమెరికన్‌ ఇండియన్‌ దంపతులు ప్రమోద్‌, మధుకుమార్‌ ఇంటికి ఫర్నీచర్ వస్తువులు కొరియర్‌లో ఒక్కొక్కటిగా వచ్చి చేరుతున్నాయి. అయితే తాను ఆ వస్తువులు ఆర్డర్‌ చేయలేదంటూ మధుకుమార్‌ డెలివరీ బాయ్స్‌తో వాదనకు దిగింది. దాంతో వారు ఆర్డర్‌కి సంబంధించిన వివరాలను ఆమె ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యింది. ఎందుకంటే విలువైన వస్తువులు ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ చేసింది మరెవరో కాదు.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే ఇరవై నెలల బాబు ఆయాన్ష్‌. తల్లి ఫోన్‌లో వాల్‌మార్ట్‌ యాప్‌లో కార్ట్‌లో పిక్‌ చేసి ఉన్న వస్తువులను చిన్నారి బాలుడు సునాయాసంగా ప్లేస్‌ ఆర్డర్‌ చేసేశాడు. ఇలా అమెరికన్‌ కరెన్సీలో 2000 డాలర్లు .. ఇండియన్‌ కరెన్సీలో లక్షా 49 వేల రూపాయల విలువైన వస్తువులు బుక్‌ చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయాన్ష్‌ ఎప్పుడు ఫోన్‌ పట్టుకునే ఉంటాడని, కానీ ఫేస్‌ రికగ్నేషన్‌, పాస్‌కోడ్‌ ఉన్న ఫోన్‌ను ఆయాన్ష్‌ ఎలా ఓపెన్‌ చేశాడన్నది మిస్టరీగా మారింది. వెంటనే ఆ చిన్నారి చేతికి కొన్ని ఫోన్లు ఇవ్వగా ఈ మెయిల్స్‌ పంపడం, కాంటాక్ట్‌ లిస్ట్‌ చెక్‌ చేయడం, క్యాలెండర్‌ క్లోజ్‌ చేయవం వంటి పనులు పర్‌ఫెక్ట్‌గా చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి అమెరికా మీడియాలో బాగా పాపులర్‌ అయ్యింది. దీంతో 20 నెలల చిచ్చర పిడుగు ఆయాన్ష్‌ ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్‌ సిసింద్రీగా మారాడు. పొరపాటున ఆర్డర్‌ చేసినట్టుగా తెలపడంతో.. సదరు ఫర్నీచర్‌ని వెనక్కి తీసుకునేందుకు సదరు సంస్థ అంగీకరించింది.

Also Read:  మిగిలిన పోయిన అన్నంతో గుజరాతీ ఫేమస్ స్నాక్.. రుచికరమైన ముతియా తయారీ..