NRI News: విదేశాల నుంచి తిరిగొస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఏమాత్రం ఏమరపాటైనా మొత్తం కోల్పోతారు..!

|

Oct 02, 2021 | 10:01 PM

Pravasi News: గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండం చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన చర్యలు

NRI News: విదేశాల నుంచి తిరిగొస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఏమాత్రం ఏమరపాటైనా మొత్తం కోల్పోతారు..!
Nri Peoples
Follow us on

Pravasi News: గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండం చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో దేశాల మధ్య రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పలు దేశాలు వ్యాక్సీన్ వేసుకున్న వారికి మాత్రమే తమ దేశంలోకి ఎంట్రీ చేస్తున్నాయి. వ్యాక్సీన్ వేసుకున్నట్లుగా సర్టిఫికెట్ చూపించడంతో పాటు.. మూడు రోజుల ముందు కరోనా టెస్ట్ చేయించుకుని దానికి సంబంధించి నెగిటీవ్ రిపోర్ట్ ను చూపిస్తేనే దేశంలోకి ఎంట్రీ ఉంటుంది. మన దేశంలోనూ ప్రభుత్వం ఇలాంటి నిబంధనలే విధించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాక్సీన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్‌తో పాటు.. కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపిస్తేనే దేశంలోకి ఎంట్రీ చేస్తున్నారు. లేదంటూ అటు నుంచి అటే పంపించేస్తున్నారు.

అయితే, ఈ అవసరాన్ని కొందరు కేటుగాళ్లు తమ దోపిడీకి ఉపయోగించుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారే లక్ష్యంగా.. దారి దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాక్సీన్, కరోనా నెగిటీవ్ సర్టిఫికెట్ల పేరుతో విదేశాల నుంచి వచ్చిన వారిని నిలువు దోపిడీ చేసేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చి వ్యక్తిని దొంగలు నిలువునా దోచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి న్యూఢిల్లీ క్రైమ్ బ్రాంక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమబెంగాల్‌కు చెందిన మహమ్మద్ వాసి కొన్నేళ్లుగా సౌదీలో నివసిస్తున్నాడు. ఇటీవలే ఇండియాకు వచ్చిన వాసీ.. ఢిల్లీలో కోల్‌కతా ట్రైన్ ఎక్కేందుకు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, ఇంతలో ఓ వ్యక్తి వాసీ వద్దు వచ్చి ట్రైన్ ఎక్కాలంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, నెగిటీవ్ రిపోర్ట్ ఉండాలని, అలాగే వ్యాక్సీన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్ ఉండాలని ఓ అధికారి మాదిరిగా బిల్డప్ ఇచ్చాడు. దానికి స్పందించిన వాసీ.. ఎయిర్‌పోర్టులోనే తనకు కరోనా టెస్ట్ చేశారని, నెగిటీవ్ అని వచ్చిందని వివరించాడు. అదంతా ఇక్కడ నడవదని, టెస్ట్ చేయించుకోవాల్సిందే అంటూ నమ్మించాడు. దాంతో వాసీ.. కరోనా టెస్ట్ చేయించుకునేందుకు దుండగుడి వెంట వెళ్లాడు. పహాడ్‌గంజ్‌లో వాసీకి కోవిడ్ టెస్ట్ చేయించాడు. అయితే, ఉదయం 11 గంటలకు టెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడంతో.. ఉదయం వరకు వేచి చూశాడు. ఇక కోవిడ్ రిపోర్ట్ తీసుకునేందుకు వాసీ.. ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, రిపోర్ట్ కావాలంటే 897 రియాల్స్(సౌదీ కరెన్సీ) కావాలని దుండగులు డిమాండ్ చేశారు. దాంతో వాసీ షాక్ అయ్యాడు. అంత సొమ్ము ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పాడు. దాంతో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. జేబు నుంచి కత్తులు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం అతన్ని దారుణంగా కొట్టారు. అతని వద్దు డబ్బులు లాక్కుని పంపించేశారు. పాస్ పోర్ట్ కూడా లాక్కుని పారేశారు.

అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితుడి నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. బాధితుడిని బెదిరించిన ఆరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చే వారు ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Also read:

Janasena Pawan Kalyan: బద్వేల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జనసేన.. ఆ నిర్ణయానికి కారణమేంటంటే..

EPS డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేదంటే సాధ్యంకాదు..

Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ పరువాలు పొగడతరమా… మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..