అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడి దుర్మరణం చెందాడు. వెస్ట్ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 లకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి సాయిష్ వీర ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్,1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్ పనిచేస్తున్న వీర.. దోపిడీకి ప్రయత్నించిన దొంగను అడ్డుకున్నాడు. దాంతో రెచ్చిపోయిన దుండగులు.. సాయిష్ వీరపై కాల్పులు జరిపారు. ఆ కాల్పు్ల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అనుమానితుడి ఫోటోలను విడుదల కొలంబస్ పోలీసులు. ఈ సంవత్సరం కొలంబస్‌లో ఇది 50వ హత్య.
24 ఏళ్ళ సాయిష్ వీర .. మరో రెండు వారాల్లో ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ అనుకోని ఘటన జరగడం.. అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిష్ వీరా.. కొలంబస్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. H1 B వీసా కూడా తీసుకున్నాడు. అందరికి అడగ్గానే హెల్ప్ చేసే వాడనీ.. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని.. అతని ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..