Air India: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. భారత్ – యూఎస్‌ విమానాలు రద్దు.. ఎందుకంటే..!

|

Jan 19, 2022 | 11:36 AM

Air India: USAలో 5G కమ్యూనికేషన్‌ల విస్తరణ కారణంగా జనవరి 19, 2022 నుండి విమానాల మార్పుతో భారతదేశం నుండి USAకి..

Air India: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. భారత్ - యూఎస్‌ విమానాలు రద్దు.. ఎందుకంటే..!
Follow us on

Air India: USAలో 5G కమ్యూనికేషన్‌ల విస్తరణ కారణంగా జనవరి 19, 2022 నుండి విమానాల మార్పుతో భారతదేశం నుండి USAకి కార్యకలాపాలు తగ్గించినట్లు, ఇందుకు విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించినచిన అప్‌డేట్ త్వరలో తెలియజేస్తామని తన ట్వీట్‌లో తెలిపింది. యూఎస్‌ ప్రభుత్వం ప్రస్తుత 5G రోల్‌అవుట్ ప్లాన్ విమానయానంపైప్రభావం చూపే అవకాశం ఉందని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇది 1.25 మిలియన్ల యునైటెడ్ ప్రయాణీకులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, కనీసం 15,000 విమానాలు, 40 కంటే ఎక్కువ అతిపెద్ద విమానాశ్రయాల ద్వారా ప్రయాణంపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

రన్‌వేల పక్కన అమర్చినప్పుడు 5G ​​సిగ్నల్స్ పైలట్‌లు టేకాఫ్ చేయడానికి, ప్రతికూల వాతావరణంలో ల్యాండ్ చేయడానికి ఆధారపడే కీలకమైన భద్రతా పరికరాలకు ఆటంకం కలిగిస్తాయని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మేము భద్రతపై ఎలాంటి రాజీపడటం లేదు.. కానీ ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు 5G సాంకేతికతను విస్తరణపై విధి విధానాలు రూపొందించడం జరిగిందని పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి:

NRI: విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారా.? మీ బ్యాంక్ ఖాతాను మార్చుకోవాల్సిందే.. ఈ విషయాలు తెలుసుకోండి!

Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక