Insider Trading: సైలెంట్‌గా కోట్లు కొల్లగొట్టారు.. అమెరికాలో ఏడుగురు తెలుగు వారిపై కేసు నమోదు..

|

Mar 30, 2022 | 5:30 AM

US Insider Trading: సైలెంట్‌గా ట్రేడింగ్‌ చేశారు.. ఎవరికీ తెలియదనుకున్నారు.. కానీ మోసం రెండేళ్ల తర్వాత బయట పడిపోయింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ స్కామ్‌లో పాత్రదారులంతా మన తెలుగు వారే

Insider Trading: సైలెంట్‌గా కోట్లు కొల్లగొట్టారు.. అమెరికాలో ఏడుగురు తెలుగు వారిపై కేసు నమోదు..
Cyber
Follow us on

US Insider Trading: సైలెంట్‌గా ట్రేడింగ్‌ చేశారు.. ఎవరికీ తెలియదనుకున్నారు.. కానీ మోసం రెండేళ్ల తర్వాత బయట పడిపోయింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ స్కామ్‌లో పాత్రదారులంతా మన తెలుగు వారే కావడం గమనార్హం.. చేసిన తప్పుకు ఇప్పుడు వారంతా ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం వీరు ఈ మోసానికి పాల్పడగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ ఆరా తీయగా ఈ భారీ మోసం బయటపడింది. వీరిపై ఫెడరల్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీలో హరి ప్రసాద్‌ సూరి, లోకేశ్ లగుడు, చోటు ప్రభుతేజ్‌ పులగం పని చేస్తున్నారు. హరిప్రసాద్‌ 2020లో ట్విలియో కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తన ఫ్రెండ్ దిలీప్‌ కుమార్‌ రెడ్డికి చేరవేశాడు. లోకేశ్‌ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌, మరో స్నేహితుడు అభిషేక్‌కు కంపెనీ విషయాలను వెల్లడించాడు. ప్రభుతేజ్‌ తన సోదరుడు చేతన్‌ ప్రభుకు తెలిపాడు. వీరంతా ట్విలియో ఆప్షన్స్‌లో విజయవంతంగా ట్రేడింగ్‌ చేశారు.

ట్విలియో సంస్థ త్రైమాసిక ఫలితాలు ప్రకటించక ముందే వీరు బ్రోకరేజ్‌ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ట్విలియో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడం, కంపెనీ షేర్లు పెరగడం చకచకా జరిగిపోయాయి. అనుమానం వచ్చిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ ఆరా తీయగా.. ఈ మోసం వెలుగు చూసింది. మార్చి-మే 2020లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నప్పుడు వీరంతా ఈ మోసానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ మొత్తం వ్యవహరంలో 1 మిలియన్‌ డాలర్‌కు పైగా అక్రమ లాభార్జన పొందినట్లు దర్యాప్తులో తేలింది. కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఫెడరల్‌ అధికారులు వీరిపై అభియోగాలు నమోదు చేశారు.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం పెరిగినట్లు వీరు గుర్తించారు. ఈ వివరాలతో కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడిస్తే కచ్చితంగా ట్విలియో షేర్ల ధర పెరుగుతుందని గ్రహించారు.

Also Read:

ussia-Ukraine war: ఉక్రెయిన్‌ రక్షణ కోసం రాకెట్‌ విడిచి, ఆయుధాలు చేతపట్టిన టెన్నిస్ స్టార్ ప్లేయర్..

RUSSIA-UKRAINE WAR: ఇస్తాంబుల్ సమాలోచనల్లో కాసింత పాజిటివిటీ.. రష్యా వెనక్కి తగ్గడం వెనుక రీజనిదే!