Germany lifts ban on travellers from delta: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కరోనాలోని డెల్టా ప్లస్ వేరియంట్ అలజడి రేపుతోంది. అయితే.. భారత్‌లో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. కరోనా వైరస్ డెల్టా ప్లయ్ వేరియంట్ నేపథ్యంలో జర్మనీ, పలు దేశాలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్..భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది. గతంలో వీటికి ఏరియాస్ ఆఫ్ వేరియంట్ కన్సర్స్ అనే పేరుతో పిలిచేవారు. అయితే ఇప్పుడు చోటు చేసుకున్న మార్పులతో విదేశీ ప్రయాణికులు నిరభ్యంతరంగా జర్మనీకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. వారం క్రితం దుబాయ్ ప్రభుత్వం కూడా భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుండటంతో దుబాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: