జర్మనీలో 41 ఏళ్ళ టీచర్ నర మాంస భక్షకుడిగా మారాడు. ఇతడి రాక్షస కాండ బయటి ప్రపంచానికి తెలిసి నిర్ఘాంతపోయింది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఈ వ్యక్తి ఎందుకిలా మారాడో పోలీసులకు, చివరకు కోర్టు న్యాయమూర్తులకు సైతం అంతు చిక్కలేదు. అర్మిన్ మెవిస్ అనే ఈ టీచర్ ఆన్ లైన్ డేటింగ్ సర్వీసు ద్వారా 43 ఏళ్ళ స్టెఫాన్ టీ అనే మెకానిక్ తో పరిచయం పెంచుకున్నాడు. గత సెప్టెంబరులో ఈ మెకానిక్ ని బెర్లిన్ లోని తన ఇంటికి పిలిపించుకున్నాడని..హతమార్చి అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి తిన్నాడని డీపీఏ వార్తా సంస్థ తెలిపింది. ఈ ముక్కల్లో కొన్నింటిని నగరంలో అక్కడక్కడా పారేశాడని ఈ సంస్థ పేర్కొంది. ఆచూకీ తెలియకుండా పోయిన మెకానిక్ స్టెఫాన్ కోసం పోలీసులు గాలిస్తూ చివరకు నగర శివార్లలోని అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ వారికి కొన్ని ఎముకలు లభించాయి. స్నిఫర్ డాగ్స్ ని రంగంలోకి దించగా.. అవి నిందితుడిని పట్టించాయి. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడంతో కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. 2006 లో కూడా అర్విన్ మెవిస్ ఆన్ లైన్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తిని హతమార్చి..ఇలా చేసినందుకు కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసు నుంచి ఎలా బయట పడ్డాడో గానీ అప్పటి నుంచి నరమాంస భక్షకుడిగా మారాడు. ఇతగాడు ఇంకెంతమందిని చంపి తిన్నాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.
2015 లో ఓ పోలీసు అధికారి ఒకరిని హతమార్చి ఇలా కానిబాలిస్టుగా మారాడు. అతడిని నాడు పోలీసులు అరెస్టు చేశారు. క్యానిబాలిజం పై నెట్ లో …. ఓ చర్చా గోష్ఠిని చూసి అతడు ఇలా నరమాంస భక్షకుడిగా మారాడట.. జర్మనీలో ఇలాంటి వ్యక్తుల ఉదంతాలు తెలిసి ప్రజలు వణికిపోతున్నారు. లోగడ ఆఫ్రికాలో ఇదీ అమీన్ అనే నియంత ఇలా కొన్ని వందలమందిని చంపి తిన్నాడని వార్తలు అప్పట్లోనే వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : వైసీపీ నేతలకు భయం పట్టుకుంది అన్న నారా లోకేష్ కు అనిల్ యాదవ్ కౌంటర్ :Nara Lokesh vs Anil Yadhav Video.
కొత్త వివాదంలో కంగనా రనౌత్.. ఆమె డ్రెస్ పై నెటిజన్లు భయంకరమైన ట్రోలింగ్ : Kangana Ranaut Video.