బిల్ గేట్స్ దంపతుల డైవోర్స్ వ్యవహారం.. రెండేళ్ల తరువాత ఎవరికి వారేనా ..??

| Edited By: Phani CH

Jul 08, 2021 | 3:55 PM

త్వరలో విడిపోనున్న బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ తమ డైవోర్స్ ప్లాన్ ని అమలు లోకి తెచ్చి విడిపోయాక కూడా తమ ధార్మిక సంస్థ (బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్) కోసం కో-ఛైర్మన్స్ గా పని చేయవచ్చునని తెలుస్తోంది.

బిల్ గేట్స్ దంపతుల డైవోర్స్ వ్యవహారం.. రెండేళ్ల తరువాత ఎవరికి వారేనా ..??
Bill Gates
Follow us on

త్వరలో విడిపోనున్న బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ తమ డైవోర్స్ ప్లాన్ ని అమలు లోకి తెచ్చి విడిపోయాక కూడా తమ ధార్మిక సంస్థ (బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్) కోసం కో-ఛైర్మన్స్ గా పని చేయవచ్చునని తెలుస్తోంది. అయితే రెండేళ్ల తరువాత ఇక తామిద్దరూ ఈ పదవుల్లో కొనసాగలేమని భావిస్తే మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కో-చైర్, ట్రస్టీ పదవులకు రాజీనామా చేస్తారని ఈ సంస్థ ప్రకటించింది. ఇలా జరిగితే బిల్ గేట్స్ ఆమెను బయటకు పంపివేయాల్సి ఉంటుంది. దాంతో ఆమె తన సొంత ధార్మిక కార్యకలాపాల కోసం ఆయననుంచి సహజంగానే’భరణం’ పొందుతుంది. ఇలా ఆమె అందుకునే సొమ్ముకి ఫౌండేషన్ కి సంబంధం ఉండదని, ఇది ఆమెకు వేరుగా నిర్దేశించిన సొమ్ము అవుతుందని ఈ సంస్థ చైర్మన్ మార్క్ సుజ్ మన్ తెలిపారు. తామిద్దరూ ఒకరికొకరు కుదుర్చుకునే ఒప్పందాల మీద ఇది ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ మాజీ కపుల్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చెప్పలేమన్నారు.గత 2 నెలలుగా తాము చేసిన పనులను వీరు విడివిడిగాను, కలిసి కూడా తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ఫౌండేషన్ ఆదాయం సుమారు 50 బిలియన్ డాలర్లుప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ధార్మిక సంస్థ గ్లోబల్ హెల్త్, విద్య వంటి వివిధ రంగాలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలకు సుమారు 5 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తోంది.

అమెరికా వంటి దేశాల్లో స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండాలని కోరుతున్న ఫ్రెంచ్ మెలిండా గేట్స్… జెండర్ ఈక్వాలిటీ కార్యక్రమానికి ఒక బిలియన్ డాలర్ల విరాళాన్ని ఇస్తానని 2019 లో ప్రకటించారు. మహిళా సాధికారత గురించి ఆమె ఎక్కువగా చెబుతుంటారు. తమ 27 ఏళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతున్నట్టు.. తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించగానే ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ‘సమ్ థింగ్ ఇన్ కిమ్’..బాగా బరువు తగ్గి సన్నబడిపోతున్నాడట…!! నో డౌట్ అంటున్న సౌత్ కొరియా…

Pawan kalyan – Sharmila Party: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీపై జనసేనాని రియాక్షన్