
అత్యంత కిరాతకంగా 33 మందిని హత్య చేసిన డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌కు అమెరికాలోని ఎల్ సాల్వెడార్‌లోని కోర్టు 1,310 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 90కిపైగా హత్యలకు కుట్రలుపన్నడంతోపాటు అనేక భయంకరమైన నేరాలకు పాల్పడటంతో ఏకంగా శతాబ్ధాలపాటు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే..
అమెరికాకు చెందిన విల్మర్ సెగోవియా అనే కరడుగట్టిన నేరస్థుడు మారా సాల్వత్రుచా గ్యాంగ్‌కు చెందిన షల్టన్ సెల్ సభ్యుడు. ఈ గ్యాంగ్‌ను ఎమ్‌ఎస్-13 అని కూడా పిలుస్తారు. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్‌లో ఈ గ్యాంగ్ ఎన్నో నేరాలకు పాల్పడింది. ఈ గ్యాంగ్‌కు చెందిన మరో నేరస్థుడికి ఇటీవల 945 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 22 హత్యలు, దాడులు, దోపిడీలకు పాల్పడ్డాడు. ఎమ్‌ఎస్-13లో ఏకంగా 60 వేల మంది గ్యాంగ్ సభ్యులు ఉన్నారు. ఈ గ్యాంగ్‌కు చెందిన వేలాడి నేరస్తులను ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం తాజాగా మరొక మెగా జైలుకు తరలించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘2 వేల మంది ముఠా సభ్యులను అమెరికాలోనే అతిపెద్ద జైలు అయిన దాదాపు 40 వేల సామర్థ్యం కలిగిన సెంటర్ ఫర్ ది కన్‌ఫైన్‌మెంట్ ఆఫ్ టెర్రరిజమ్ (CECOT)కి తకలించాం. ఈ జైల్లోనే వారంతా శతాబ్ధాలపాటు శిక్ష అనుభవిస్తారని అథ్యక్షుడు తన పోస్టులో తెలిపారు. జైలులోకి వరుసగా ఖైదీలను తరలిస్తున్న వీడియోను కూడా బొకెలే ట్వీట్ చేశారు. ఈ వీడియోలో నేరస్తులు వరుసగా జైల్లోకి వెళ్లడం చూడొచ్చు. మరోవైపు ఈ వీడియోపై మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి దాదాపు 64 వేల మంది అనుమానిత ముఠా సభ్యులను అరెస్టు చేశారని, వారు దోషులుగా నిర్ధారించబడకముందే ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hoy en la madrugada, en un solo operativo, trasladamos a los primeros 2,000 pandilleros al Centro de Confinamiento del Terrorismo (CECOT).
Esta será su nueva casa, donde vivirán por décadas, mezclados, sin poder hacerle más daño a la población.
Seguimos…#GuerraContraPandillas pic.twitter.com/9VvsUBvoHC
— Nayib Bukele (@nayibbukele) February 24, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.