Galwan Valley Clash: భారత్‌పై విషం కక్కుతున్న డ్రాగన్‌ కంట్రీ చైనా.. జిన్‌పింగ్ ఘనతగా గల్వాన్‌ ఘర్షణ..

డ్రాగన్‌ కుట్ర..! సామ్రాజ్యవాద కాంక్ష.. మరోసారి బయటపడింది. గల్వాన్‌లో ఘర్షణకు ఉసిగొల్పి, భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూసిన చైనా.. తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది.

Galwan Valley Clash: భారత్‌పై విషం కక్కుతున్న డ్రాగన్‌ కంట్రీ చైనా.. జిన్‌పింగ్ ఘనతగా గల్వాన్‌ ఘర్షణ..
Galwan Valley Clash

Updated on: Oct 17, 2022 | 1:18 PM

డ్రాగన్‌ కుట్ర..! సామ్రాజ్యవాద కాంక్ష.. మరోసారి బయటపడింది. గల్వాన్‌లో ఘర్షణకు ఉసిగొల్పి, భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూసిన చైనా.. తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న సీసీపీ 20వ జాతీయ మహాసభ వేదికపై జిన్‌పింగ్‌ పదేళ్లలో సాధించిన విజయాలను ప్రదర్శించారు. అందులో భాగంగానే.. గల్వాన్‌ ఘర్షణ.. జిన్‌పింగ్‌ ఘనతగా ప్రదర్శించారు. భారత్‌-చైనాలను యుద్ధం అంచువరకూ తీసుకెళ్లి.. లక్షల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్‌ ఘర్షణను షీ జిన్‌పింగ్‌ ఘనతగా సీసీపీ ప్రచారం చేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభ వేదికపైకి పార్టీ జనరల్‌ సెక్రటరీ జిన్‌పింగ్‌ రావడానికి కొద్దిసేపటి ముందు.. పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో దేశీయ ప్యాసింజర్ జెట్‌ విమానం, అంతరిక్ష పరిశోధనలతోపాటు.. గల్వాన్‌లో భారత్‌-చైనా దళాల ఘర్షణను కూడా చూపించారు. ఈ చిత్రాల్లో పీఎల్‌ఏ కమాండర్‌ క్వీ ఫాబోవా రెండు చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు.

గల్వాన్‌ ఘర్షణ తర్వాత నుంచి చైనా మీడియా విభాగం ఈ చిత్రాన్ని విపరీతంగా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లింది. పీఎల్‌ఏ కమాండర్‌ క్వీ ఫాబోవా కూడా ది గ్రేట్‌ హాల్‌ ఆప్‌ పీపుల్స్‌లో జరుగుతున్న సీసీపీ జాతీయ మహాసభకు హాజరయ్యారు. గల్వాన్‌ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు అతడు గ్రేట్‌ హాల్లోనే ఉన్నాడు. కాగా.. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కావాలనే డ్రాగన్ కంట్రీ ఈ దురాఘతానికి పాల్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

2020 ఏప్రిల్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. చైనా వైపు కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు పీఎల్‌ఏ అధికారికంగా ప్రకటించింది. కానీ, దాదాపు 40 మంది వరకు చైనా సైనికులు మరణించినట్లు రష్యా సహా పలు దేశాల వార్తాసంస్థలు, నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..