Fuel Tanker Blast: లెబనాన్‌లో ఘోర ప్రమాదం, ఇంధన ట్యాంకర్ పేలి 20 మృతి.. కొనసాగుతున్న సహక చర్యలు

Fuel Tanker Blast: లెబనాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర లెబనాన్ లోని అక్కార్‌లో ఇంధన ట్యాంకర్ పేలి భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. అనేక మంది..

Fuel Tanker Blast: లెబనాన్‌లో ఘోర ప్రమాదం, ఇంధన ట్యాంకర్ పేలి 20 మృతి.. కొనసాగుతున్న సహక చర్యలు
Lebanon Akkar

Updated on: Aug 15, 2021 | 9:27 AM

Fuel Tanker Blast: లెబనాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర లెబనాన్ లోని అక్కార్‌లో ఇంధన ట్యాంకర్ పేలి భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.  ప్రమాదం గురించి సమాచారం అందుకున్న లెబనీస్  ఆర్మీ సైనికులు, లెబనీస్ రెడ్ క్రాస్ తన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థలంలో 20 మృతదేహాలను, ఏడుగురు గాయపడిన వ్యక్తులను అక్కర్‌లోని ఆసుపత్రులకు తరలించాయని చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో లెబనీస్ రెడ్ క్రాస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

 

Also Read: పిల్లల్లో పాము DNA ఉంది.. రాక్షసులుగా మారతారంటూ కన్న బిడ్డలని చంపేసిన కసాయి తండ్రి..ఎక్కడంటే