Brazil Covid Hospital: బ్రెజిల్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. మృత్యువాతపడ్డ నలుగురు కరోనా బాధితులు

బ్రెజిల్ దేశంలోని కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Brazil Covid Hospital: బ్రెజిల్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. మృత్యువాతపడ్డ నలుగురు కరోనా బాధితులు
Brazil Covid Hospital Fire Accident

Updated on: May 29, 2021 | 10:27 AM

Brazil Covid Hospital Fire Accident: మరో కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ దేశంలోని కోవిడ్ రోగులున్న ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకున్న కరోనా బాధితులు నలుగురు మరణించారు. తూర్పు బ్రెజిలియన్ నగరమైన అరకాజు నగరంలోని నెస్టార్ పీవా కోవిడ్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలోని రోగులు, వారి సహాయకులు కొందరిని మంటల బారి నుంచి కాపాడారు. అగ్నిప్రమాదం జరిగినపుడు ఆసుపత్రిలో 60 మంది రోగులున్నారు. మరణించిన వారిలో 77 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. రోగులను కాపాడి వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టామని మేయర్ ఎడవల్డో నోజిరియా చెప్పారు.

Read Also…  Covid Vaccine Extortion: కరోనా విపత్తును వ్యాపారంగా మల్చుకుంటున్న కంత్రీగాళ్లు.. వ్యాక్సిన్‌ను వదలని కేటుగాళ్లు.. టీవీ9 నిఘాలో అసలు నిజాలు