రష్యా క్షిపణి పరీక్ష విఫలం

ఆర్కిటిక్‌ ప్రాంతంలోని రష్యా క్షిపణి పరీక్ష కేంద్రంలో పెను విస్ఫోటం చోటుచేసుకుంది. దీంతో ఆ దేశ అణుసంస్థ రోసాటమ్‌కు చెందిన ఐదుగురు ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విస్ఫోటం వల్ల సమీపంలోని నగరంలో రేడియోధార్మికత స్థాయి పెరిగింది. ఆర్కాంగ్లెస్క్‌ ప్రాంతంలోని న్యోనోస్కాలో ఉన్న అత్యంత రహస్యమైన సైనిక కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. జెట్‌ ఇంజిన్‌లోని ద్రవ ఇంధనాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడులో అణు ఇంధనం పాత్ర ఉందన్న […]

రష్యా క్షిపణి పరీక్ష విఫలం
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 8:49 PM

ఆర్కిటిక్‌ ప్రాంతంలోని రష్యా క్షిపణి పరీక్ష కేంద్రంలో పెను విస్ఫోటం చోటుచేసుకుంది. దీంతో ఆ దేశ అణుసంస్థ రోసాటమ్‌కు చెందిన ఐదుగురు ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విస్ఫోటం వల్ల సమీపంలోని నగరంలో రేడియోధార్మికత స్థాయి పెరిగింది. ఆర్కాంగ్లెస్క్‌ ప్రాంతంలోని న్యోనోస్కాలో ఉన్న అత్యంత రహస్యమైన సైనిక కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. జెట్‌ ఇంజిన్‌లోని ద్రవ ఇంధనాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడులో అణు ఇంధనం పాత్ర ఉందన్న విషయం రష్యా సైన్యం తొలుత ప్రకటించలేదు. ఘటన అనంతరం రేడియో ధార్మికత స్థాయి కూడా సాధారణంగానే ఉన్నట్లు తెలిపింది. అయితే అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని సెవెరోద్‌విన్స్క్‌ నగరంలో కొద్దిసేపు రేడియోధార్మికత స్థాయి పెరిగింది.