కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల్లో ఆహుతైన అటవీ ప్రాంతం

|

Sep 11, 2024 | 7:25 PM

అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్‌ ఏంజెల్స్‌కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజినల్‌ పార్క్‌లో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన వేడి గాలులు వీస్తున్నాయి.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల్లో ఆహుతైన అటవీ ప్రాంతం
Fire Disaster In California
Follow us on

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా దక్షిణభాగంలో లైన్ ఫైర్ కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. ఎన్నో వేల ఎకరాలను ఇది కాల్చి బూడిద చేసింది. దీంతో వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్‌ ఏంజెల్స్‌కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజినల్‌ పార్క్‌లో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన వేడి గాలులు వీస్తున్నాయి.

గత రెండు, మూడు రోజులుగా కాలిఫోర్నియాలో, నెవాడాలోని వాషూ కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రెనోలో 20వేల మందిని మరోచోటకు తరలించాల్సి వచ్చింది. దాదాపు 100 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు కృషి చేస్తున్నారని తెలిసింది. రెండు రాష్ర్టాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..