కొంతమంది రిలేషన్ బ్రేక్ అయ్యాక.. భాగస్వామికి దూరం అయినందుకు చాలా బాధపడతారు. సమస్యలు సర్దుబాటు చేసుకుని మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళతారు. కొంతమంది మాత్రం పగతో రగిలిపోతూ తమ ఎక్స్ కు పాఠం నేర్పించాలనుకుంటారు. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
బ్రిటన్లో ఒక మహిళ తన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి యూట్యూబ్లో గతంలో అతడితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోను అప్లోడ్ చేసింది. వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ తీసుకున్న ఫోటోలను ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు పంపింది. ఈ సంఘటన తర్వాత 50 ఏళ్ల సదరు మహిళను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రెస్టన్ కోర్టు న్యాయమూర్తి మహిళ చేసిన ఈ చర్య చాలా సిగ్గుచేటు అని అభివర్ణించారు. తన మాజీ ప్రియుడు తనను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా తనను బ్లాక్ చేయడం వల్ల ఆ మహిళ అసహనానికి గురై ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మహిళ తన మాజీ ప్రియుడి తండ్రికి చాలా ప్రైవేట్ ఫోటోలను పంపింది. అనేక ప్రైవేట్ వీడియోలను తన మాజీ ప్రియుడి కుమార్తెకు సెండ్ చేసింది. మీ తండ్రి చేసిన దుర్మార్గాలను ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడగలదని ఆ మహిళ సదరు యువతితో చెప్పింది. నా ఆఫీసులో పనిచేసే చాలా మంది మీ తండ్రిని చూసి చాలా గట్టిగా నవ్వుతున్నారని ఆమె పేర్కొంది. అయితే అభ్యంతరకరమైన కంటెంట్ కారణంగా ఈ వీడియోలు వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించబడ్డాయి.
Also Read: ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు