England: యూకే లో కరోనా మరోమారు విజృంభిస్తోంది. లక్డౌన్ సడలింపులు పరకటించడం మొదలు పెట్టిన తరువాత ఇక జూన్ 21 నుంచి పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించారు యూకేలో. అయితే, పరిస్థితి కుదుట పడక పోవడంతో ఆంక్షలను జూలై 19 వరకూ పొడిగించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ సడలింపు యొక్క చివరి దశ తర్వాత కూడా ఇంగ్లాండ్ ను కరోనావైరస్ నుండి రక్షించడానికి “అదనపు జాగ్రత్తలు” అవసరం అని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. రాబోయే కొద్ది రోజులలో” ఏమి జరుగుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. డెల్టా వేరియంట్ ద్వారా పెరుగుతున్న కేసుల కారణంగా ఆంక్షలను ఎత్తివేయడం జూలై 19 వరకు వాయిదా పడినా కరోనా కేసులు ఇంకా పెరుగుతున్నాయి.
గురువారం ఇక్కడ దాదాపు 28,000 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. జనవరి నెల తరువాత ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతే కాకుండా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో 22 మరణాలు నమోదు అయ్యాయి. గత 28 రోజులల్లో ఇదే అత్యధిక మరణాల నమోదు. దీంతో యూకే అంతటా ఆందోళన నెలకొంది. లాక్డౌన్ ఆంక్షలు ఉండగానే ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఈ సమయంలో, మహమ్మారిని నియంత్రించే ప్రయత్నాలలో ప్రజా, జాతీయ ప్రభుత్వాలు క్రమశిక్షణతో ఉండకపోతే యూరప్ అనివార్యంగా కోవిడ్ -19 సంక్రమణల కొత్త వేవ్ ఎదుర్కొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ చీఫ్, హన్స్ క్లుగే మాట్లాడుతూ, ఈ వేవ్ లో అదనపు మరణాలు పెరగడానికి మూడు కారణాలుగా ఉంటాయని చెప్పారు. తక్కువమంది వ్యాక్సిన్ తీసుకోవడం, సామాజిక దూరం తగ్గిపోవడం, కొత్త కరోనా వేరియంట్లు ఈ మూడూ ప్రధాన కారణాలుగా మళ్ళీ కరోనా విజృంభిస్తోందని ఆయన చెప్పారు.
Also Read: Nirav modi:అన్నకు చెల్లి సాయం.. నీరవ్ మోడీ సోదరి రూ. 17 కోట్లు చెల్లించింది..ఇక కేసెక్కడిది ?
నిప్పుల కొలిమిలా మారిన కెనడా- యూస్.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు