UK Drought: యూరప్ 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు.. ఎండిపోయిన థేమ్స్ నది..

|

Aug 13, 2022 | 12:18 PM

UK Drought: యూరప్ 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఎదుర్కొంటుంది. అటు ఇంగ్లండ్‌లో కరువు వచ్చే పరిస్థితి ఉందని, దీనికి దేశం ఇంకా సిద్ధంగా లేదని..

UK Drought: యూరప్ 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు.. ఎండిపోయిన థేమ్స్ నది..
England Drought
Follow us on

UK Drought: యూరప్ 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఎదుర్కొంటుంది. అటు ఇంగ్లండ్‌లో కరువు వచ్చే పరిస్థితి ఉందని, దీనికి దేశం ఇంకా సిద్ధంగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, యూకే ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, సరైన వర్షాలు కురవకపోవడంతో ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోతోంది.1935 తర్వాత ఎన్నడూ లేని విధంగా గత నెలలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల ధాటికి యూకే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. లండన్ హీత్రూ ప్రాంతంలో 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. యూరప్ 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటుందని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు.

అటు థేమ్స్ నది ఎండిపోవడం వల్ల ఇంగ్లండ్ లో కరువు వచ్చే పరిస్థితి ఉందని.. దీనికి దేశం ఇంకా సిద్ధంగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై నెలలో అత్యంత పొడి వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు సగటు వర్షపాతం 23.1 మిల్లీమీటర్ల నమోదు అయింది. ఇది నెలలో సగటు వర్షపాతంలో 35 శాతం మాత్రమే. థేమ్స్ నది తూర్పున ఎసెక్స్ వద్ద సముద్రంలోకి ప్రవేశించే ముందర.. పశ్చిమాన గ్లౌసెస్టర్ షైర్ నుంచి లండన్ మహానగరం మీదుగా 356 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నది పుట్టుకకు కారణం అయిన సహజ నీటి బుగ్గలు ఈ వేసవిలో ఎండిపోయాయి. దీంతో నదీ ప్రవాహం తగ్గిపోయింది.థేమ్స్ నది ఇంగ్లాండ్, లండన్ ప్రజలకు మంచి నీటి సరఫరాకు అత్యంత ముఖ్యమైంది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా దీనిపై ఆధారపడి ఉన్నారు. ఆగస్టులో ఇంగ్లాండ్ లో వర్షాలు కురవకపోతే..పొడి శీతాకాల పరిస్థితులు ఉంటే వచ్చే వేసవి కాలంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..