Elon Musk: అమెరికా పాలిటిక్స్‌లో సరికొత్త స్టార్ ఎలాన్ మస్క్.. ట్రంప్ గెలుపులో కీ రోల్
అంతరిక్షంలో అద్భుతాలు చేశాడు. టెక్నాలజీతో తెగ ఆడేసుకున్నాడు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన హ్యాండ్ పడితే ప్రత్యర్థి కూడా షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవాల్సిందే. అలాంటి ది గ్రేట్ బిజినెస్‌మెన్ ఎలాన్ మస్క్... ఇప్పుడు అమెరికా పాలిటిక్స్‌లో సరికొత్త స్టార్. ట్రంప్‌నకు మాత్రం సూపర్ స్టార్. ఈ నాలుగేళ్లు ట్రంప్‌తో కలసి మస్క్ పనిచేస్తారు దాంట్లో నో డౌంట్. మరి తర్వాత ఏంటి...? ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ కోసం మస్క్ పనిచేశారా...? నెక్ట్స్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మస్కేనా...? ఒకవేళ అదే జరిగితే అమెరికా పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయ్...?
మస్క్ అంటే Xకి బాస్… స్పేస్ Xకి అధినేత… టెస్లాకు హోల్ అండ్ సోల్ ఓనర్… ఇదంతా నిన్నటివరకు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో మస్క్ పాలిటిక్స్‌లోనూ స్టార్ అయిపోయారు. ట్రంప్ విక్టరీ కోసం ఆయన పడ్డ కష్టం… ప్రపంచదేశాల్లో బిగ్ సౌండ్ చేస్తోంది. ట్రంప్ కాబోయే అధ్యక్షుడైతే.. మస్క్ ఆయన ప్రభుత్వంలోనే ఓ కీలక భాగస్వామి. కేబినెట్ హోదా యాడ్ అవుతుందో, అడ్వైజర్ పోస్టే దక్కుతుందో తెలీదుగానీ.. మస్క్ ప్రొఫైల్‌లో మాత్రం కొత్త ట్యాగ్ యాడ్ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది. అమెరికా రాజకీయాల్లో మస్క్ మార్క్ మొదలుకానుంది.
ట్రంప్ గెలుపు కోసం సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే చేశారు మస్క్. తనకున్న ఫాలోయింగ్‌తో ప్రముఖులతో కలిసి పవర్ ఫుల్ క్యాంపెయిన్ రన్ చేశారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నతరంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ప్రజల్లో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అలాగే ట్రంప్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సూపర్ సక్సెస్ అయ్యారు. అలాగే ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం… ఆకట్టుకునేలా మాట్లాడం కూడదా ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేశాయి. ఓవరాల్‌గా మస్క్ టార్గెట్‌ను రీచ్ అయ్యారు.
రిపబ్లికన్ పార్టీ విక్టరీలో మస్క్‌కే అగ్రభాగం ఇచ్చారు ట్రంప్. తమ బంధంపై కూడా సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేశారు. ఎలాన్ ఐ లవ్ యూ అన్నారు. విజయోత్సవ సభలో ఫ్యామిలీ కంటే మస్క్‌నే ఎక్కువ పొగిడేశారు. మస్క్ అనుకుంటే అయిపోద్ది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
మొత్తంగా… మస్క్ అంటే ట్రంప్ ఆత్మ అన్నట్లుగా మారిపోయింది సీన్. మస్క్‌కి కూడా ట్రంప్ అంటే అమితమైన ప్రేమా కనిపిస్తోంది. ఈ నాలుగేళ్లు ఇద్దరి స్నేహం కంటిన్యూ అవుతుంది. ఇంతవరకూ ఓకే..! మరి నెక్ట్స్ ఏంటి…? మస్క్ ప్లాన్స్ ఎలా ఉన్నయ్…? మస్క్ పెట్టుకున్న అసలు టార్గెట్ ఏంటి…? ఇప్పుడివే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా పొలిటికల్ సర్కిల్‌లో ట్రంప్ గెలుపు కంటే మస్క్ ఫ్యూచర్‌పైనే తెగ చర్చ నడుస్తోంది.
నెక్ట్స్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మస్ట్‌గా మస్కే అన్న వాదనలు అమెరికాలో రీసౌండ్ చేస్తున్నాయి. ట్రంప్ గెలుపు కోసం మస్క్ పడిన కష్టం… పక్కా ఫ్యూచర్ ప్లాన్‌లో భాగమేనన్న చర్చలూ జరుగుతున్నాయి. అమెరికాలో రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసివారు… మూడోసారి పోటీ చేయడానికి ఛాన్స్ ఉండదు. దీంతో వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అపర కుభేరు మస్కే అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంపై ట్రంప్-మస్క్ మధ్య ఓక్లారిటీ ఉందంటున్నారు. ఇప్పుడు ట్రంప్ గెలుపు కోసం మస్క్ పనిచేస్తే… వచ్చే ఎన్నికల్లో మస్క్ కోసం ట్రంప్ పనిచేస్తారన్న టాక్ అగ్రరాజ్యంలో గట్టిగా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మస్క్ కర్చీఫ్ వేశారన్నమాట.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..