Top Billionaires: వరల్డ్ బిలియనీర్లలో టాప్‌లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్… ముకేశ్ అంబానీది ఎన్నో స్థానమో తెలుసా?
ఆర్థిక అసమానతల సంగతేమోగానీ ప్రపంచంలో కుబేరుల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 3వేల28కి పెరిగింది. ప్రపంచ కుబేరుల మొత్తం సంపద విలువెంతో తెలుసా.. 16.1 లక్షల కోట్ల డాలర్లు. 2025 జులైకి సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం...

ఆర్థిక అసమానతల సంగతేమోగానీ ప్రపంచంలో కుబేరుల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 3వేల28కి పెరిగింది. ప్రపంచ కుబేరుల మొత్తం సంపద విలువెంతో తెలుసా.. 16.1 లక్షల కోట్ల డాలర్లు. 2025 జులైకి సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ది బిలియనీర్స్‌లో టాప్ ర్యాంక్. జూన్‌తో పోలిస్తే సంపద విలువ 16 బిలియన్ డాలర్లు తగ్గినా ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్కే టాప్‌లో ఉన్నారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎలిసన్. ఆయన నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకారు. ఒరాకిల్ షేరు 32శాతం రాణించడంతో ఆయన ర్యాంక్ పెరిగింది. ఇక ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 247.9 బిలియన్ డాలర్ల సంపదతో 3వ స్థానంలో ఉన్నారు. 236.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఫోర్త్ ర్యాంక్‌లో నిలిచారు. ఇక ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 147.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ బిలియనీర్లలో 5వ స్థానంలో ఉన్నారు.
గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 146.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 6వస్థానంలో నిలిచారు. ఇక బెర్క్ షైర్‌హాత్‌వేతో వారెన్ బఫెట్ 7వస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 143.1 బిలియన్ డాలర్లకు చేరింది. 141.3 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ స్టీవ్ బామర్‌కి ప్రపంచ టాప్ టెన్ బిలియనీర్లలో 8వస్థానం దక్కింది. గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ 139.7 బిలియన్ డాలర్ల సంపదతో 9వస్థానంలో నిలిచారు. ఎన్‌విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ 137.9 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 10వస్థానం దక్కింది.
ప్రపంచ కుబేరుల సంపద జూన్‌తో పోలిస్తే 100 బిలియన్ డాలర్లు పెరిగి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. వీరిలో తొమ్మిది మంది అమెరికన్లే. సంపద విలువ 7 రోజుల్లోనే దాదాపు 30% తగ్గటంతో టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్‌కి చోటు దక్కలేదు. ఇక దాదాపు 116 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 15వ స్థానంలో ఉన్నారు రిలయన్స్ ముకేశ్ అంబానీ. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీనే.




