Elon Musk: మాట ఇచ్చాడు.. చేసి చూపించాడు.. వార్ జోన్లో ఎలాన్ మస్క్ కీ రోల్..

|

Feb 27, 2022 | 7:24 PM

మాట ఇచ్చాడు.. చేసి చూపించాడు.. ఉక్రెయిన్ ప్రజలకు నేనున్నానంటూ ఆపన్న హస్తం ఇచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి చూపిస్తున్నాడు.

Elon Musk: మాట ఇచ్చాడు.. చేసి చూపించాడు..  వార్ జోన్లో ఎలాన్ మస్క్ కీ రోల్..
Elon Musk
Follow us on

ఉక్రెయిన్‌ను(Ukraine) తన కబంధ హస్తాల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రష్యా( Russia). అయితే రష్యా దాడులను తిప్పికొట్టేందకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఉక్రెయిన్. అయితే ఉక్రెయిన్ లోని టెలీకమ్యూనికేషన్(telecommunication) వ్యవస్థను ఇతర సాంకేతిక వ్యవస్థలను నాశనం చేసింది. దీంతో శత్రువుల కదలికలపై సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లేక ఉక్రెయిన్ సైన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమంయంలో తనదైన తరహాలో సాయం అందించేందుకు ఎంట్రీ ఇచ్చాడు ఎలన్ మస్క్. మాట ఇచ్చాడు.. చేసి చూపించాడు.. ఉక్రెయిన్ ప్రజలకు నేనున్నానంటూ ఆపన్న హస్తం ఇచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఆయనే ఎలన్‌మస్క్‌. కానీ ఎలన్‌మస్క్‌ చేసిన ఆ పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈక్రమంలో.. తమ దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించాలంటూ యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్..టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ కు విజ్ఞప్తి చేశాడు. దీంతో తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలాన్ మస్క్.  తమ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలకు చేరేవేసేందుకు అక్కడి ప్రజలకు ఎంతో కీలకంగా మారింది. ఇప్పుడు ఆన్‌ లైన్‌ సేవలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోలేక ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

ఇటువంటి సమయంలో రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ను బాసటగా నిలిచాడు టెస్లా అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌. స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలను ఉక్రెయిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని ఉక్రెయిన్ కు మస్క్ హామీ కూడా ఇచ్చాడు.

ఫెడోరోవ్ ట్వీట్ చేసిన 10 గంటల తర్వాత మస్క్ ప్రతిస్పందించాడు. స్టార్‌లింక్ సేవలు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యాక్టివ్‌గా ఉన్నాయని రానున్న రోజుల్లో మరిన్ని టెర్మినల్స్ కూడా అనుసంధానిస్తామని మస్క్ పేర్కొన్నారు. ఇక యుక్రెయిన్ కు ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్ కు అందుకు సహాయం చేసిన అమెరికాలోని యుక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవాకు ఫెడోరోవ్ ధన్యవాదాలు తెలిపారు.

అదే సమయంలో ఎలాన్ మస్క్ నిర్ణయం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో శక్తివంతమైన స్టార్ లింక్ వ్యవస్థ నుంచి సైబర్ దాడులు చేయాలంటే రష్యాకు సాధ్యపడని పని.

ఇవి కూడా చదవండి: National Protein Day: ప్రోటీన్ సమృద్ధికి బూస్టర్.. ఆధునిక సైన్స్‌తో పోషకాహార లోపానికి చెక్ .. 

Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..