ఆత్మీయ బంధం, కళ్ళు లేని నక్కకు కాళ్ళు లేని కుక్కే ఆధారం, ఎంత విచిత్రం ?

| Edited By: Anil kumar poka

Mar 10, 2021 | 8:19 PM

జంతులోకంలో వేర్వేరు జాతుల జంతువుల మధ్య అవినాభావ సంబంధం, స్నేహం చాలా అరుదు. జాతి వైరాన్ని మరచి కుక్కలు, పిల్లుల మధ్య సాన్నిహిత్యం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం..

ఆత్మీయ బంధం, కళ్ళు లేని నక్కకు కాళ్ళు లేని కుక్కే ఆధారం, ఎంత విచిత్రం ?
Follow us on

జంతులోకంలో వేర్వేరు జాతుల జంతువుల మధ్య అవినాభావ సంబంధం, స్నేహం చాలా అరుదు. జాతి వైరాన్ని మరచి కుక్కలు, పిల్లుల మధ్య సాన్నిహిత్యం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం.. తల్లి వదిలేసి అనాథలైన కుక్క పిల్లలకు మేకలు, అలాగే ఆవులు పాలిచ్చి ఆదుకోవడం..ఇంకా ఈ విధమైన అపురూప స్నేహ బాంధవ్యాలు అబ్బురపరుస్తాయి. ఇప్పుడు కాళ్ళు లేని ఓ కుక్కకు, కళ్ళు లేని ఓ నక్కకు మధ్య కుదిరిన బంధమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. లండన్ లో అనా లపాజ్ అనే మహిళ విషయానికే వస్తే.. ఈమె కొంతకాలం క్రితం కళ్ళు లేని  ఏడాది వయసున్న నక్కను తెచ్చుకుంది. అంతకు ముందే ఆమె వద్ద వెన్ను ట్యూమర్ కారణంగా సరిగా నడవలేని చిన్న శునకం కూడా ఉంది. జాక్ అనే పేరుగల ఈ బుజ్జి కుక్క కోసం ఆమె చిన్నపాటి వీల్ చైర్ వంటిది కూడా సమకూర్చింది.  దాంతో అది ఎంచక్కా ఆ చైర్ సాయంతో నడుస్తుంది, పరుగెత్తుతుంది కూడా.. ఇక  పెంపుడు నక్కకు ఆమె ‘పంప్ కిన్ ‘ అని పేరు పెట్టుకుంది. ఈ కుక్కకు, నక్కకు మధ్య ఎలా స్నేహం కుదిరిందో గానీ రెండూ ఒకదానికొకటి విడిచి ఉండలేక పోతున్నాయి.

జాక్ తన వీల్ చైర్ సాయంతో ఎక్కడకు వెళ్లినా దాని వెంటే ఆ శబ్దం వింటూ  పంప్ కిన్ కూడా పరుగులు  తీస్తుంటుంది. పెద్ద జంతువులేవైనా  దగ్గరికి వస్తే ఇవి ఒకదానికొకటి రక్షణగా ఉంటాయట కూడా.. నక్క ఎక్కడైనా ఆగిపోతే జాక్ అది వచ్చేవరకు ఆగుతుందని, లేదా తనే దాని దగ్గరకు వెళ్తుందని అనా లపాజ్ తెలిపింది. లండన్ లోని ఈమె ఇంట్లో ఈ రెండు జంతువులూ హాయిగా గడిపేస్తున్నాయి. వీటి ఆలనాపాలనలో తన కెంతో తృప్తి  కలుగుతోందని, వీటి  గాఢ స్నేహం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంటుందమీ ఆమె తెలిపింది. మొత్తం మీద  పంప్ కిన్, జాక్ మాత్రం హ్యాపీ !

మరిన్ని చదవండి ఇక్కడ :

Rare Animal: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న వింత జంతువు… ఈ వింత జంతువు ఏంటో మీరు గుర్తించగలరా…?