Facebook issue in Australia: సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిపై మోదీతో సమీక్షించినట్లు స్కాట్ మారిసన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో వార్తలను ఫేస్‌బుక్, గూగుల్ వాడుకోవడంపై కొత్తగా ఓ చట్టం చేశారు. ఈ రెండు సంస్థలూ తాము వాడుకునే వార్తలకు కొంత మొత్తంలో డబ్బు చెల్లించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. దీంతో ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంది. ఫేస్‌బుక్‌లో ఆస్ట్రేలియా ప్రజలు ఎవరూ న్యూస్‌కు సంబంధించిన కంటెట్ షేర్ చేయడానికి, అలాగే చూడటానికి వీలు లేకుండా బ్లాక్ చేసింది.
అయితే తాము చేసిన చట్టంపై ప్రపంచంలో చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, అందుకే ఫేస్‌బుక్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని మారిసన్ ఆరోపించారు. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మాట్లాడానని.. పరిస్థితిని వివరించానని వెల్లడించారు. దీనిపై ప్రపంచ దేశాధినేతలతో చర్చించి ఫేస్‌బుక్‌పై నిర్ణయం తీసుకుంటామని మారిసన్ శుక్రవారం వెల్లడించారు.
Also Read: