Pink Fairy Armadillo: అంతరించిపోతున్న అందమైన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో.. ఇసుకలో ఈదడం, పిల్లలకు పాలివ్వడం దీని స్పెషాల్టీ..

|

Oct 09, 2021 | 6:25 PM

Pink Fairy Armadillo: ఇసుకలో మనం ఒక అడుగు తీసి మరో అడుగు వెయ్యడానికి ఎంతో కష్టపడతాం.. అదే సముద్రపు పీత వంటి జీవులైతే. చకచకా పాకేస్తాయి..

Pink Fairy Armadillo: అంతరించిపోతున్న అందమైన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో.. ఇసుకలో ఈదడం, పిల్లలకు పాలివ్వడం దీని స్పెషాల్టీ..
Pink Fairy Armadillo
Follow us on

Pink Fairy Armadillo: ఇసుకలో మనం ఒక అడుగు తీసి మరో అడుగు వెయ్యడానికి ఎంతో కష్టపడతాం.. అదే సముద్రపు పీత వంటి జీవులైతే. చకచకా పాకేస్తాయి. ఇక ఇసుకను తొలుస్తూ..చకచకా పాకె అతిచిన్న అందమైన జీవి గురించి మీకు తెలుసా..వీపుపై షెల్ , ముందు పాదాలకు బలమైన గోళ్ళు, చిన్న మొహంతో చూడగానే వింతగా ఇందే ఈ జీవి.. అరచేతిలో కూడా హ్యాపీగా కూర్చుంటుంది. అయితే ఈ జీవి ప్రత్యేకత ఏమిటంటే ఇసుకలో చాలా ఫాస్ట్ గా ఈదుతుంది. లేత గులాబీ రంగులో షెల్ తో అందంగా కనిపించే ఈజీవిని ఇసుకలో ఈదే జీవి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.

పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో… అలుక జాతికి చెందిన అతిచిన్న జంతువు. ఎడారిలో జీవించే ఈ క్షీరదాన్ని 1825లో రిచర్డ్ హర్లన్ కనుగొన్నారు. సెంట్రల్ అర్జెంటీనాకు చెందిన ఈ జంతువు ఒంటరిగా ఎడారిల్లో, ఇసుక మైదానాలు , దిబ్బలు , గడ్డి భూములలో నివసిస్తుంది. చిన్న కళ్ళు, సిల్కీ పసుపురంగు తెల్లటి బొచ్చు, ఒక సన్నని షెల్ తో పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో అందంగా ఉంటుంది. తోక కదలకుండా బిగుసుకుని ఉంటుంది. ఈ జీవి రాత్రి సమయంలో ఒంటరిగా తిరుగుతుంది. కీటకాలు, పురుగులు, నత్తలు, వివిధ మొక్కల వేర్లను ఆహారంగా తీసుకుంటుంది.

దీని కనీసం పదేళ్ల అయినా బతికే ఈ జీవులను కుక్కలు వెంటబడి మరీ తింటాయి.  అదనుకనే వీటి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపొతుంది. ప్రస్తుతం ఒక పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోని శాస్త్రజ్ఞులు 4 సంవత్సరాలకు పైగా రక్షిస్తున్నారు. ఇదే అతి ఎక్కువ వయసు గలిగిన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో గా ప్రస్తుతం రికార్డ్ కెక్కింది.

Also Read:  రేపు నవరాత్రుల్లో నాలుగో రోజు.. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు.. తయారీ ఎలా అంటే..

పంటలు తింటున్నాయని 30 లక్షల పిచ్చుకలను చంపేసిన చైనా.. ఆ పాపం ఎలాంటి పరిస్థితిని కల్పించిందంటే