అవునా.. పాక్‌కు సపోర్ట్ చేయలేదా..! చైనా గుంట నక్క కహానీ నమ్మేలా ఉందా..?

కొన్నిసార్లు చైనా ఏం తెలియని ఎడ్డి పిల్లలెక్క ప్రవర్తిస్తుంది. ఒక్కోసారి ఆ దేశం చెప్పే కథలు వింటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా అండగా నిలిచిన విషయం తెలిసిందే. చైనా మాత్రం కొత్త కహానీ చెప్తోంది. అది వింటే మీరు అవాక్కవుతారు.

అవునా.. పాక్‌కు సపోర్ట్ చేయలేదా..! చైనా గుంట నక్క కహానీ నమ్మేలా ఉందా..?
India China

Updated on: Jul 08, 2025 | 6:13 PM

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు చైనా అండగా నిలిచిన విషయం ప్రపంచానికి తెలిసిందే. మన ఆర్మీ అధికారులు సైతం డ్రాగన్ వెనక నుంచి పాక్‌కు అండగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మన ఆయుధాల వివరాలను ఎప్పటికప్పుడు పాక్‌కు అందజేసిందని చెప్పారు. మనం ఒక్క సరిహద్దు విషయంలో పాక్ , చైనా, టర్కీలతో పోరాడాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ , లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. దీంతో చైనా తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో చైనా స్పందించింది. మరో కొత్త కహానీతో ప్రపంచం ముందుకు వచ్చింది. తాము భారత్‌కు వ్యతిరేకంగా ఎవరికి సాయం చేయలేదని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. చైనా, పాకిస్థాన్ పొరుగు దేశాలని.. తమ మధ్య సాంప్రదాయ స్నేహం మాత్రమే ఉందని వ్యాఖ్యానించింది. పాక్‌కు అండగా ఉంటూ ఇతర దేశానికి వ్యతిరేకంగా పనిచేయలేదని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘ఆ ఆరోపణలు ఎలా వచ్చాయో మాకు అర్ధం కావడం లేదు. భారత్ – పాక్ మధ్య శాంతయుత పరిస్థితి కొనసాగేందుకు మేం ఇద్దరికీ మద్ధతుగా ఉంటాం’’ అని అన్నారు.

తమ దేశానికి ఎవరి సపోర్ట్ అవసరం లేదని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అన్నారు. పాక్ చైనా అండతో యుద్ధం చేసిందన్న వ్యాఖ్యలను మునీర్ కొట్టిపారేశారు. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అణగదొక్కే ఏ దాడినైనా సమర్ధంగా తిప్పికొడతామని చెప్పారు. దానికి ఇతర దేశాల సాయం తీసుకోమని చెప్పారు. మేం అన్ని దేశాలతో శాంతియుత వాతావరణ కోరుకుంటామని చెప్పారు. కాగా ఇటీవలే మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనూ భేటీ అయ్యారు. ఈ రెండు దేశాల మాటలు వింటే ఏం తెలియని అమాయకుల్లా అనిపిస్తోంది. కానీ నిజం ప్రపంచానికి తెలుసు.

రాహుల్ సింగ్ ఏమన్నారంటే..?

పాక్- చైనా ఫ్రెండ్‌షిప్ భారత్‌కు ప్రమాదకరంగా మారిందని రాహుల్ సింగ్ అన్నారు. సరిహద్దుకు సంబంధించిన వివాదల్లో పాక్ ముందుంటే.. చైనా వెనక నుంచి సపోర్ట్ ఇచ్చినట్లు ఆరోపించారు. పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 81శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవేని చెప్పారు. మన ఆయుధాల సమాచారాన్ని చైనా పాక్‌కు ఎప్పటికప్పుడు చేరవేసిందని.. టర్కీ సైతం పాక్‌కు అన్ని విధాల అండగా నిలిచిందని విమర్శించారు. డ్రోన్లను అందజేసి.. మనపై దాడులకు సపోర్టుగా ఉందని మండిపడ్డారు. ఒక సరిహద్దు వివాదంపై ముగ్గురు ప్రత్యర్ధులతో మనం పోరాడాల్సి ఉంటుందని.. ఇటువంటి తరుణంలో భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ సింగ్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..