వామ్మో.. అక్కడ అసలేం జరుగుతోంది.. ఒత్తిడితో ఐదుగురు AI శాస్త్రవేత్తల మరణం..
అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.. టెక్ యుద్ధం.. సుంకాల పోరు రోజు రోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.. ఈ క్రమంలో ఓ సంచలన విషయం ఆందోళనకు గురిచేసింది.. అమెరికాతో కొనసాగుతున్న టెక్ యుద్ధం మధ్య పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు సమాచారం.. శాస్త్రవేత్తల వయస్సు 38 -55 సంవత్సరాల మధ్య ఉంటుందని నివేదిక పేర్కొంది.

అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.. టెక్ యుద్ధం.. సుంకాల పోరు రోజు రోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.. ఈ క్రమంలోనే ఓ ఘటన సంచలనంగా మారింది. AI రంగంలో చైనా, అమెరికా మధ్య సాంకేతిక యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఒక చైనీస్ మీడియా వెల్లడించినట్లు తెలుస్తోంది.. ఈ వార్త నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం, చైనా కృత్రిమ (AI) మేధస్సు రంగంలో ‘డీప్‌సీక్’ తో వార్తల్లో నిలిచింది.. దాని తక్కువ ఖర్చుతో కూడిన మోడల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, ‘డీప్‌సీక్’ ఆపిల్ యాప్ స్టోర్‌లో చాట్ GPTని కూడా అధిగమించింది.
కానీ చైనా మీడియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వేగంగా..అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు రంగంలో చైనా ప్రతిభకు కొరత లేనప్పటికీ, అక్కడ అనేక విజయగాథలు వ్రాయబడుతూ చరిత్ర సృష్టిస్తున్నప్పటికీ..ఇటీవలి సంవత్సరాలలో ఈ రంగంతో సంబంధం ఉన్న కొంతమంది అగ్రశ్రేణి వ్యక్తులను దేశం కోల్పోయిందని పేర్కొంది.
ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఐదుగురు అగ్రశ్రేణి AI శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధన వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని, పని కోసం చైనాకు తిరిగి వచ్చినవారేనని నివేదిక వెల్లడించింది.
చైనీస్ కంప్యూటర్ శాస్త్రవేత్త లియు షావోషన్ మాట్లాడుతూ.. AI పరిశోధకులు అధిక జీతాలు సంపాదిస్తున్నప్పటికీ, వారు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీని వల్ల తీవ్రమైన పోటీ ఉంటుందని ఆయన వివరించారు.
2022 – 2025 మధ్య ప్రాణాలు కోల్పోయిన AI శాస్త్రవేత్తల జాబితాను కూడా ఈ నివేదిక ప్రచురించింది. వారి వయస్సు 38 -55 సంవత్సరాల మధ్య ఉంది. అటువంటి పరిస్థితిలో, ఈ అకాల మరణాలు పోటీ ఒత్తిడితో ముడిపడి ఉన్నాయని నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..