AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు వార్తలను ఖండించిన క్రెమ్లిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవమన్నారు క్రెమ్లిన్‌ అధికారులు. 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్.. అక్టోబర్ 23న రోజంతా క్రెమ్లిన్‌లో తన అధికారిక విధులను కొనసాగించారు. బ్రెజిల్ అధ్యక్షుడితో పుతిన్ ఫోన్‌లో సంభాషించినట్టు తెలిపారు. అలాగే క్రెమ్లిన్‌లో రష్యాలోని ఓ ప్రాంతానికి చెందిన గవర్నర్‌ను కూడా పుతిన్ కలిశారని క్రెమ్లిన్ అధికార వర్గాలు వెల్లడించారు.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు వార్తలను ఖండించిన క్రెమ్లిన్
Vladimir Putin
Balaraju Goud
|

Updated on: Oct 24, 2023 | 2:15 PM

Share

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరు. ఇంత వయసొచ్చినా పుతిన్ ఫిట్ నెస్ అద్భుతం. అయినప్పటికీ, పుతిన్‌కు ఇప్పుడు ఎలా ఉంది? రష్యా అధ్యక్షుడు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురైన వార్తలు రావడంతో మళ్లీ చర్చ మొదలైంది.. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్‌ పుతిన్‌ ఆరోగ్య పరిస్థితిపై తరచూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తా సంస్థలు చెబుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో పుతిన్‌ ఇబ్బందులు ఎదుర్కోవడంతో అత్యవసరంగా వైద్య బృందాలు ఆయన ఇంటికి వచ్చాయని పేర్కొన్నాయి. అయితే రష్యా అధ్యక్షుని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. పుతిన్ ఆరోగ్యంపై వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఖండించారు. టివి9కి అందిన సమాచారం ప్రకారం, వ్లాదిమిర్ పుతిన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.

ఉక్రెయిన్‌ మీద ఆ దేశం యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి పుతిన్‌ ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆయన పార్కిన్సన్‌ బారినపడ్డారని, అందుకే బహిరంగ ప్రదేశాల్లో కూడా వణుకుతా కనిపిస్తున్నారని కథనాలు వచ్చాయి.. పుతిన్‌కు క్యాన్సర్‌ సోకిందని, దీనికి రహస్యంగా చికిత్స తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరగింది. తాజాగా మరోసారి పుతిన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. పుతిన్‌ కొద్ది రోజుల పాటు అజ్ఞాతంగా ఉండటం, ఎవరినీ కలుసుకోకపోవడం కూడా చర్చనీశాంధంగా మారింది. అయితే ఇవన్నీ ఫేక్‌ వార్తలేనని క్రెమ్లిన్‌ స్పష్టం చేస్తూ వచ్చింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవమన్నారు క్రెమ్లిన్‌ అధికారులు. 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్.. అక్టోబర్ 23న రోజంతా క్రెమ్లిన్‌లో తన అధికారిక విధులను కొనసాగించారు. అక్టోబర్ 23న పుతిన్ రోజంతా క్రెమ్లిన్‌లో తన అధికారిక విధులను కొనసాగించారని వెల్లడించారు. అదే సాయంత్రం బ్రెజిల్ అధ్యక్షుడితో పుతిన్ ఫోన్‌లో సంభాషించినట్టు తెలిపారు. అలాగే క్రెమ్లిన్‌లో రష్యాలోని ఓ ప్రాంతానికి చెందిన గవర్నర్‌ను కూడా పుతిన్ కలిశారని క్రెమ్లిన్ అధికార వర్గాలు వెల్లడించారు. అయితే పుతిన్ గుండెపోటు వార్త మొదట టెలిగ్రామ్ ఛానెల్‌ SVR లో అందించారు.

అయితే క్రెమ్లిన్‌లో రిపోర్టింగ్ చేస్తున్న ఒక ఛానెల్ జనరల్ SVR పుతిన్ గుండెపోటు గురించి తప్పుడు వార్తలను ఇచ్చింది. అక్టోబర్ 22 ఆదివారం రాత్రి పుతిన్‌కు గుండెపోటు వచ్చిందని ప్రకటించారు. పుతిన్ తన మంచం మీద నుండి పడిపోవడంతో టేబుల్ తలకు తగలడంతో ముక్కుకు తీవ్రమైన గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ రక్తంతో తడిసి నేలపై పడి ఉన్నారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది వైద్యుడికి సమాచారం అందించినట్టు.. డాక్టర్ సీపీఆర్ ద్వారా పుతిన్‌ను స్పృహలోకి తీసుకువచ్చినట్లు తప్పుడు కథనాలు వెలువడ్డాయి. అయితే ఇదంతా అవాస్తవమని క్రెమ్లిన్ వర్గాలు tv9 రష్యా ప్రతినిధి మనీష్ ఝాకు వివరించింది.

మనీష్ ఝా , టీవీ 9 ప్రతినిధి, రష్యా. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…