
ఐదేళ్లకోసారి జరుగుతున్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ సదస్సు బీజింగ్‌లో ముగిసింది. 2012లో అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి జిన్‌పింగ్ – పార్టీలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు. అధికారాన్ని మరింత సొంతం చేసుకుంటూ మూడోసారి పగ్గాలు చేపట్టడం తథ్యంగా కనిపిస్తోంది. అంతే కాదు తన స్థానాన్ని పదిలంగా ఉంచేందుకు వీలుగా ముఖ్యమైన నాయకులకు రిటైర్మెంట్ ప్రకటించి అనుచరులను అందలమెక్కించారు. జిన్‌పింగ్ ఉద్వాసన పలికిన వారిలో ప్రస్తుత ప్రధాని లీ-కికీయాంగ్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
చైనా అధ్యక్షుడిగాఉండే వ్యక్తికి రెండు పర్యాయాలు మాత్రమే ఆ పదవిలో ఉండే వెసులుబాటు ఉంది. 2018లో ఆ నిబంధనను తొలగించారు జిన్‌పింగ్. తద్వారా ఇప్పుడు ఆయన ముచ్చటగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమైంది. అలా చేయనట్టు అయితే జిన్‌పింగ్ ఈ వారం గద్దె దిగాల్సి ఉండేది. ఇక ప్రజా నాయకుడనే బిరుదును ఆయన స్వీకరించడం మాత్రమే మిగిలి ఉంది. మావో జెడాంగ్ తర్వాత ఆ గౌరవాన్ని ఇంత వరకు ఎవరు అందుకోలేదు. ఆ బిరుదును ఆయన అందుకుంటే ఇక ఆయనను ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటారు. ఆయనను ఒక దేవుడిగా కొలుస్తారు. మావోతో సమానమైన హోదా జిన్‌పింగ్ సొంతం చేసుకుంటారు.
కొత్త, పాతవారితో కూడిన 2,300 మంది పార్టీ ప్రతినిధులు పార్టీ అగ్రనాయకత్వంలో మార్పులకు ఆమోదం తెలిపారు. ఈ కమిటీ ఒక రబ్బర్ స్టాంప్ లాంటిదేననే మాటలున్నాయి. వీరంతా కలిసి కమ్యూనిస్ట్ సెంట్రల్ కమిటీకి 200 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఆదివారం ఈ కమిటీ సమావేశమై తమ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ను మరోసారి ఎన్నుకుంటుంది. ఆ తర్వాత మార్చిలో వార్షిక పార్లమెంట్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడిగా జిన్ జిన్‌పింగ్ ప్రకటిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..