Jordan port city of Aqaba: జోర్డాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ను రవాణా చేస్తున్న సమయంలో.. అది కిందపడిపోవడంతో గ్యాస్ లీకైనట్లు అధికారులు పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ అనంతరం భారీ పెలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను సంఘటనా స్థలానికి పంపినట్లు డైరెకర్టే పేర్కొంది. ప్రస్తుతం 199 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు ఇండ్లలోనే ఉండాలని.. ఇండ్ల కిటికీలు, తలుపులు మూసివేయాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు. సంఘటనా స్థలం నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..