ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ ముగ్గురు చైనా వ్యోమగాములకు రోజూ ‘పండగే ‘ ! వారు ఏం తింటారంటే …?

| Edited By: Phani CH

Jun 20, 2021 | 1:52 PM

చైనా ఇటీవల తన ముగ్గురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపింది. టియన్ హే స్పేస్ సెంటర్ నుంచి రోదసికి ఎగసిన అంతరిక్షనౌకలో నీ హైషింగ్, లియు బొమింగ్, టాంగ్ హాంగ్ బో అనే ఈ ముగ్గురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ ముగ్గురు చైనా వ్యోమగాములకు రోజూ పండగే  ! వారు ఏం తింటారంటే ...?
3 Astronauts
Follow us on

చైనా ఇటీవల తన ముగ్గురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపింది. టియన్ హే స్పేస్ సెంటర్ నుంచి రోదసికి ఎగసిన అంతరిక్షనౌకలో నీ హైషింగ్, లియు బొమింగ్, టాంగ్ హాంగ్ బో అనే ఈ ముగ్గురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరారు. వీరు తమ వెంట 120 ఫుడ్ వెరైటీలను తీసుకువెళ్లడం విశేషం. అంతరిక్ష కేంద్రంలో వీళ్ళు మూడు నెలలపాటు ఉండాల్సి ఉంటుంది. అందుకే వీరికి బలవర్ధకమైన ఆహారాన్ని చైనా ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సహజ సిధమైన వంటకాలను తయారు చేయించింది. కుంగ్ పావో చికెన్, (చికెన్ తో చైనీస్ కుక్స్ చేసే స్పెషల్ వంటకం), ష్రెరెడెడ్ పోర్క్ విత్ గార్లిక్ సాస్ (వెల్లుల్లి రసంతో డ్రై చేసిన పోర్క్ డిష్), బీజింగ్ సాస్ పోర్క్ ష్రెడ్స్ వంటివి వీటిలో ఉన్నాయి. ఇవన్నీ శరీరం బరువు పెరగకుండా చూసే తేలికపాటి ఐటెమ్స్ అట…పైగా ప్రోటీన్ రిచ్ ఆహార పదార్థాలు కూడా అంటున్నారు. ఇవే గాక రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. స్పేస్ ఫుడ్ సహా స్టేపుల్.నాన్- స్టేపుల్ ఫుడ్ కూడా ఉండడం విశేషం. మాంసాహారమే కాకుండా కూరగాయలతో చేసిన డిషెస్ కూడా ఉన్నట్టు చైనా స్పేస్ సెంటర్ వర్గాలు తెలిపాయి.

ఇంకా అంతరిక్ష కేంద్రంలోని డైనింగ్ ఏరియాలో హీటింగ్ డివైజ్, ఫ్రిజ్, వాటర్ డిస్పెన్సర్, ఫోల్డింగ్ టేబుల్, ఎక్సర్ సైజ్ చేసేందుకు అనువైన సాధనాలు కూడా ఉన్నాయి.వీరికి వేర్వేరు గదుల సదుపాయం కూడా ఉంది. ఓ ట్రెయిన్ లేదా సబ్ వే క్యారేజీ కన్నా చాలా స్పెషియస్ గా ఉంటుందని సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది. తాము ఉన్న ఈ మూడు నెలల కాలంలో ఈ వ్యోమగాములకు పరిశోధనలకన్నా రోజూ ఏ ఫుడ్ వెరైటీ తినాలో అన్నదే పెద్ద సమస్యగా మారేట్టు ఉందని అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పంజాబ్ లో ‘పాగా’కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు అమృత్ సర్ టూర్…… అక్కడా తడాఖా చూపుతామని ప్రకటన

Viral video: మెట్రో ట్రైన్‌లో కోతి.. ఎంత బుద్దిగా ప్ర‌యాణం చేసిందో మీరే చూడండి