మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ‘ఇండియా ఔట్ క్యాంపెయిన్’ ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నిర్వహిస్తోంది. అయితే బంగ్లాదేశ్‌లో భారత్‌పై వ్యతిరేకతకు చైనా కారణమని నిపుణులు భావిస్తున్నారు. గతంలో మాల్దీవుల్లో కూడా డ్రాగన్ ఇదే తరహా కుట్ర చేసింది.
ప్రపంచంలోని భారతదేశానికి ప్రధాన స్నేహితులలో ఒకటిగా ఇప్పటి వరకూ పరిగణించబడుతున్న బాంగ్లాదేశ్ లో భారతదేశ వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని ఇండియా ఔట్ ప్రచారం విజ్ఞప్తి చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ రకమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా BNP నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ వాతావరణం చూస్తుంటే భారతదేశం సాయంపై ఆధారపడిన ఈ దేశం ఇంత దైర్యంగా భారత్ ను బహిష్కరించండి అని ఎలా మాట్లాడటం ప్రారంభించిందన్న ప్రశ్న తలెత్తడం సహజం. నిజానికి దీని వెనుక అతిపెద్ద కారణం చైనా.. అని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతున్నా దాని లక్ష్యం భారత్‌పైనే. ఇండియా ఔట్ ప్రచారం ద్వారా విపక్ష నేతలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. సీనియర్ BNP నాయకుడు జనరల్ రుహుల్ కబీర్ రిజ్వీ తన పరిమితులను అధిగమించారు. తాజాగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కశ్మీరీ శాలువాను దహనం చేశాడు. దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బదులిస్తూ.. ప్రతి నాయకులు తమ భార్యల భారతీయ చీరలను తగులబెట్టినప్పుడు.. వారు నిజంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పరిగణిస్తామని అన్నారు.
బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న నాయకుడి పేరు తారిఖ్ రెహమాన్. ఇతను మాజీ ప్రధాని ఖలీదా జియా, మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్ కుమారుడు. జియా ఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ 8వ అధ్యక్షుడు. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి విడిపోయిన ఐదేళ్ల తర్వాత చైనా బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. అయితే ఇరు దేశాల మధ్య ఎలాంటి సంబంధ భాంధవ్యాలు ఏర్పాటు కాలేదు. అటువంటి పరిస్థితిలో జియా ఉర్ రెహ్మాన్ రెండు దేశాల మధ్య సంబంధాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చిన నాయకుడు. అతను తన పదవీ కాలంలో బీజింగ్‌ను సందర్శించి బంగ్లాదేశ్ స్వేచ్ఛా మార్కెట్‌ను పునరుద్ధరించాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ప్రచారంలో అతని కొడుకు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తారిక్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నుండి బహిష్కరణను ఎదుర్కొంటున్నాడు. 2018లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిన విషయంలో దోషిగా నిర్ధారణ కావడంతో అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ఏకపక్షంగా గెలిచారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ అవామీ లీగ్‌ను అధికారం నుంచి దింపడం అంత సులభం కాదనే నమ్మకం బలపడింది. అంతేకాదు షేక్ హసీనా విజయం వెనుక ఎక్కడో భారత్ హస్తం ఉందని బంగ్లాదేశ్‌లోని చాలా మంది నమ్ముతున్నారు. అటువంటి పరిస్థితిలో తన తండ్రితో చైనా సంబంధాలను ఉటంకిస్తూ బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తారిక్ రెహమాన్ చైనా సహాయం తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఇంతకు ముందు మాల్దీవుల్లో కూడా చైనా ఇలాగే చేసింది కాబట్టి భారత్ వ్యతిరేక ప్రచారాన్ని చైనా కుట్రగానే పరిగణిస్తున్నారు.
చైనా క్రమంగా భారత్ పొరుగు దేశాల్లో తన వేట కొనసాగిస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవుల తర్వాత డ్రాగన్ కంట్రీ కంత్రి పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది. బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దీంతో పాటు ఆయుధాలు కూడా విక్రయిస్తోంది. బంగ్లాదేశ్‌కు ఆయుధాలను విక్రయించేవారిలో చైనా నంబర్-1 స్థానంలో ఉందని అనేక మీడియా నివేదికలలో ప్రస్తావించబడింది. అంతే కాకుండా బంగ్లాదేశ్‌కు నిరంతరం అప్పులు కూడా ఇస్తోంది. రైల్వేలు, హైవేలు, పవర్ ప్రాజెక్టులు, షిప్పింగ్‌లో పెట్టుబడుల పేరుతో బంగ్లాదేశ్‌ను చైనా నిరంతరం అప్పుల్లో ముంచుతోంది. ఒక నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ 27 ప్రాజెక్ట్‌లకు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. అంతేకాదు 8 చైనా బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ కోసం బిలియన్ డాలర్ల రుణం కూడా ఇచ్చింది. ఢాకా అషులియా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం చైనా బంగ్లాదేశ్‌కు 1300 మిలియన్ డాలర్లకు పైగా రుణం ఇచ్చింది.
బంగ్లాదేశ్‌లోని ప్యారా ఓడరేవును అభివృద్ధి చేసేందుకు చైనా ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవును, శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టును అభివృద్ధి చేసినట్లే. గ్వాదర్ చైనా ఆధీనంలో ఉంది. శ్రీలంకకు భారీ రుణం ఇస్తాననే సాకుతో చైనా 99 సంవత్సరాల లీజుకు హంబన్‌తోట పోర్టును తీసుకుంది. భారతదేశం పొరుగు దేశాలలో బంగ్లాదేశ్, చిట్టగాంగ్ పోర్ట్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఓడరేవులను స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్ మినహా ఆసియాలోని చాలా దేశాల ఓడరేవులపై చైనా ఆధిపత్యం చెలాయిస్తుంది. అటువంటి పరిస్థితిలో భారతదేశంపై ఒత్తిడి తెచ్చే విధంగా పశ్చిమ దేశాలతో బేరం కూడా చేయగలదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..