US vs China: చైనా-అమెరికాల మధ్య అనేక విషయాల్లో.. అనేక రంగాల్లో ఉద్రిక్తత క్రమేపీ పెరుగుతోంది. ఏ సమయంలోనైనా సైనిక వివాదాలు సంభవించే అవకాశాలు ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చైనా చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ఉద్రిక్తతలు పెంచే దిశలో సాగుతున్నాయి. అమెరికా నౌకాదళాన్ని, ముఖ్యంగా వారి యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు చైనా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం తన ఎడారి ప్రాంతంలో చైనా అమెరికా యుద్ధనౌకలు, డిస్ట్రాయర్ల నమూనాలను తయారు చేసింది. వీటి ద్వారా అమెరికా యుద్ధ నౌకలను ఢీకొట్టేందుకు చైనా సైనికులు ప్రాక్టీస్ చేస్తున్నారు.
బయటపెట్టిన శాటిలైట్ చిత్రాలు..
చైనా తన వైపు నుండి యుద్ధానికి అన్ని సన్నాహాలు చేస్తోంది. దీని కోసం, తన రుకియాంగ్ వద్ద ఉన్న వాయువ్య ఎడారి ప్రాంతంలో అమెరికన్ యుద్ధనౌకల నమూనాలను సిద్ధం చేసింది చైనా సైన్యం. చైనా ఈ ప్రణాళికను అమెరికాలోని కొలరాడోలో ఉన్న శాటిలైట్ ఇమేజ్ ప్రొవైడర్ అయిన మాక్సర్ టెక్నాలజీ వెల్లడించింది. మాక్సర్ కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. అమెరికా నౌకాదళాన్ని ఢీకొట్టేందుకు ఇప్పుడు చైనా ఎలాంటి సన్నాహాలు చేస్తుందో ఇవి స్పష్టం చేస్తున్నాయి.
యుఎస్, చైనా మధ్య వాణిజ్యం నుండి మిలిటరీ వరకు బహుళ ఒత్తిడిని ఎదుర్కొంటున్న మూడు స్థల సంఘర్షణ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్ అదేవిధంగా ఇండో-పసిఫిక్‌లో ఈ రెండు దేశాలకు మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. తైవాన్‌పై చైనా బలవంతపు వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, తైవాన్‌కు అన్ని విధాలుగా సహాయం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. తైవాన్‌ను తన ప్రాంతంగా భావిస్తున్న చైనా అమెరికా ప్రకటన పట్ల కలత చెందుతోంది. ఇక దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని చైనా ఆక్రమించాలనుకుని ఇక్కడి చిన్న దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. అమెరికా యుద్ధనౌక రోనాల్డ్ రీగన్ కూడా ఇక్కడే ఉంది. దీంతోపాటు హిందూ, పసిఫిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ అమెరికా, భారత్ కలిసి చైనాతో వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాయి.
అమెరికాతో ఢీకొట్టడం అంత సులభం కాదు..
చైనా తన నౌకాదళాన్ని మాత్రమే కాకుండా మొత్తం సైన్యాన్ని కూడా ఒక పెద్ద యుద్ధానికి ఆధునీకరించే లక్ష్యంతో పని చేస్తోంది. యూఎస్ నేవీ చాలా శక్తివంతమైనది. హైటెక్ యుద్ధనౌకలు.. డిస్ట్రాయర్‌లతో చాలా బలమైన వ్యవస్థ దాని సొంతం. కాబట్టి యూఎస్ నేవీతో ఢీకొట్టడం చైనాకు అంత సులభం కాదు. శాటిలైట్ చిత్రాలలో కనిపించిన సన్నివేశం కొన్ని రోజుల క్రితం యూఎస్ నేవీ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అంటే చైనా చేష్టలపై అమెరికా కూడా నిఘా పెట్టింది. మరోవైపు DF-21D బాలిస్టిక్ క్షిపణిని కూడా చైనా సిద్ధం చేసింది. ఇది క్యారియర్ కిల్లర్ అని చైనా పేర్కొంది. అంటే యుద్ధనౌకలు.. డిస్ట్రాయర్లను దీని ద్వారా నాశనం చేయవచ్చు.
ఇవి కూడా చదవండి: Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి
లండన్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో డెయిరీ ఫామ్ పెట్టాడు.. ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు..