China Floods: చైనా, మయన్మార్‌లను వణికిస్తున్న వరదలు.. 40 వేల ఇళ్లు ధ్వంసం, వరదల్లో చిక్కుకున్న 39 లక్షల మంది

|

Aug 12, 2023 | 9:16 AM

చైనా మీడియా తమ దేశ తాజా పరిస్థితిని వివరిస్తూ.. శుక్రవారం నాటికి, 39 లక్షల మంది లేదా ప్రావిన్స్ జనాభాలో ఐదు శాతం మంది వరదల చిక్కుకున్నారని తెలిపింది. నివేదిక ప్రకారం ఇక్కడ 40 వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు కాదు లక్షా 55 వేల ఇళ్లకు విద్యుత్, నీటి సమస్య తలెత్తింది. 1.75 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

China Floods: చైనా, మయన్మార్‌లను వణికిస్తున్న వరదలు.. 40 వేల ఇళ్లు ధ్వంసం, వరదల్లో చిక్కుకున్న 39 లక్షల మంది
China Floods
Follow us on

చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. శక్తివంతమైన సుడిగాలితో అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి.  వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు సహా బహిరంగ ప్రదేశాలోని చెట్లు కూలిపోయాయి. వేలాది మంది అరబ్బులు నీటిలో కొట్టుకుపోయారు. వరదల కారణంగా 29 మంది మరణించారు. డజన్ల కొద్దీ తప్పిపోయారు. మరోవైపు మయన్మార్‌లో కూడా వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు నగరాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నీట మునిగాయి.

చైనాలోని హెబీలో వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన 16 మంది కోసం గాలిస్తున్నారు. చాలా విధ్వంసం జరిగింది, నగరాన్ని తిరిగి నిర్మించడానికి రెండేళ్లు పట్టవచ్చు. ప్రావిన్స్ 95.8 బిలియన్ యువాన్ లేదా $13.2 బిలియన్ల నష్టాన్ని చవిచూసినట్లు అంచనా వేయబడింది. గత వారం, హెబీ ప్రావిన్స్‌లో భీకర టోర్నడో తర్వాత, నగరం మొత్తం వరదల్లో చిక్కుకుంది. టోర్నడో కారణంగా బీజింగ్‌లో 140 ఏళ్లలో అత్యధిక వర్షాలు కురిశాయని చెప్పారు. బీజింగ్‌లో గత వారం రోజుల్లో వరదల్లో 33 మంది చనిపోయారు.

40 వేల ఇళ్లు ధ్వంసం, 39 లక్షల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి

ఇవి కూడా చదవండి

చైనా మీడియా తమ దేశ తాజా పరిస్థితిని వివరిస్తూ.. శుక్రవారం నాటికి, 39 లక్షల మంది లేదా ప్రావిన్స్ జనాభాలో ఐదు శాతం మంది వరదల చిక్కుకున్నారని తెలిపింది. నివేదిక ప్రకారం ఇక్కడ 40 వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు కాదు లక్షా 55 వేల ఇళ్లకు విద్యుత్, నీటి సమస్య తలెత్తింది. 1.75 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చలికాలం లోపు దెబ్బతిన్న ఇళ్లన్నింటిని బాగు చేయాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం మరో 202 మిలియన్ యువాన్లను విపత్తు సహాయ నిధిగా కేటాయించింది.

మయన్మార్‌లో భారీ వర్షాలు, ఐదు రాష్ట్రాల్లో వరదలు

మయన్మార్‌లో కూడా వరదల కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గత వారం రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మయన్మార్‌లోని ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఐదుగురు చనిపోయారు. 40 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నగరంలో పలు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..