US Nuclear Submarine: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి.. అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం..

|

Oct 09, 2021 | 3:37 PM

సౌత్ చైనా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సబ్మెరైన్‌ను గుర్తు తెలియని వస్తువుని ఢీ కొట్టి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు అనుమానిస్తున్నాయి.

US Nuclear Submarine: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి..  అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం..
Us Nuclear Submarine
Follow us on

US nuclear submarine: సౌత్ చైనా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సబ్మెరైన్‌ను గుర్తు తెలియని వస్తువుని ఢీ కొట్టి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు అనుమానిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం లోపల సీ వుల్ఫ్ క్లాస్ న్యూక్లియర్ పవర్ తో నడిచే కనెక్టికట్ సబ్ మెరైన్ గుర్తు తెలియని వస్తువుని ఢీ కొట్టి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇది 5 రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ వార్త మాత్రం గురువారం రోజున వెలుగులొకి వచ్చింది. భద్రతా కారణాల రీత్యా ప్రమాదం విషయం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి ఏ మేరకు నష్టం వాటిల్లింది. ఎవరికి ప్రమాదం జరిగిందన్న విషయాలు తెలియాల్సి ఉంది.

యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియచేస్తూ సబ్మెరైన్ దేనిని ఢీ కొట్టిందో తెలియరాలేదని కానీ సబ్ మెరైన్ మాత్రం నిలకడగా ఉందని ఇందులో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ పనిచేస్తున్నదని అలాగే అందులో ఉన్న సిబ్బంది కి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు అమెరికన్ నావీ అధికారులు మాత్రం సబ్మెరైన్ లో ఇద్దరు సైలర్స్‌కి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయని మరో 9 మంది సిబ్బందికి కొద్దిపాటి గాయాలు అయ్యాయని తెలిపారు. మొదట ఇండో పసిఫిక్ ప్రాంతం అదీ అంతర్జాతీయ జలాలో ఈ సంఘటన జరిగింది అని పేర్కొన్నారు. కానీ తరువాత దక్షిణ చైనా సముద్రం లో జరిగింది అని మరో వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఈ ఘటన జరిగింది దక్షిణ చైనా సముద్రంలో అనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ జలాంతర్గామి గ్వామ్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

వారం క్రితం అమెరికన్ యుద్ధ నౌక లు దక్షిణ చైనా సముద్రంలోని మీస్ఛీఫ్ దీవుల వద్ద తిరగడం పైనా చైనా తీవ్ర హెచ్చరికలు చేసింది. మీస్చీఫ్ దీవులు తమ పరిధిలోనివి అని అక్కడ అమెరికా దాని మిత్ర దేశాల యుద్ధ నౌకలు తిరగడం తమకి తీవ్ర అభ్యంతకరమని, అయితే, ఎలాంటి చర్య తీసుకోవడానికి అయినా తాము వెను కాడబోమని చైనా ఇదివరకే హెచ్చరించింది. వారం క్రితం అమెరికన్ సబ్మెరైన్ సముద్రం అడుగున దెబ్బ తినడం అనేక అనుమానాలని రేకిత్తిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాల యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో తిరుతున్నాయి.. సముద్రం లోపల అమెరికన్ సబ్ మెరైయిన్లు వాటికి కాపలాగా ఉంటాయి అన్న సంగతి నిజం. అందులొనూ US కనెక్టికట్ న్యూ క్లియర్ ఎటాక్ సబ్ మెరైన్.

2016 లోనే కొన్ని అంతర్జాతీయ డిఫెన్స్ మాగజైన్స్ చైనా సరికొత్త సీ మైన్స్ ని తయారు చేస్తున్నది అని అవి సముద్ర గర్భంలో తిరిగే జలాంతర్గామిని తీవ్రంగా దెబ్బ తీస్తాయని వార్తలు వెలువడ్డాయి. అయితే, అది డీజిల్ ఎలెక్ట్రిక్ కావచ్చు లేదా న్యూక్లియర్ సబ్ మెరైన్ కావచ్చు సముద్ర గర్భంలో ఉండే సీ మైన్స్ ని గుర్తు పట్టే సెన్సర్స్ ను కలిగి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, కనెక్టికట్ వీటిని గుర్తించలేకపోవడం వలన ఢీ కొట్టి దెబ్బతిని ఉండవచ్చని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో మునిగిపోయిన నౌకని ఢీ కొట్టి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. కాగా, ఏ సబ్మెరైన్ అయినా ఎక్కువ లో ఎక్కువ 800 మీటర్ల లోతు వరకే మునగ గలవు. అంత కంటే కిందికి వెళితే అడుగున ఉండే నీటి వత్తిడి వల్ల హల్ దెబ్బతిని సబ్ మెరైన్ అక్కడే మునిగి పోతుంది.

Read Also… Vitamin D Deficiency: ఈ లక్షణాలు తరచుగా మీలో కనిపిస్తున్నాయా.. అయితే ‘డి విటమిన్’ లోపం ఏమో చెక్ చేసుకోండి..