China Coronavirus: చైనాలో కరోనా టెర్రర్.. మార్చురీల్లో కుప్పలు తెప్పలుగా శవాలు.. భయంలో ప్రజానీకం..

|

Dec 21, 2022 | 9:12 AM

ఈ మాయదారి కరోనా మళ్లీ విజృంభించబోతుందా..? ఆ భయానక పరిస్థితులు మళ్లీ రాబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

China Coronavirus: చైనాలో కరోనా టెర్రర్.. మార్చురీల్లో కుప్పలు తెప్పలుగా శవాలు.. భయంలో ప్రజానీకం..
China Coronavirus
Follow us on

ఈ మాయదారి కరోనా మళ్లీ విజృంభించబోతుందా..? ఆ భయానక పరిస్థితులు మళ్లీ రాబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడు రోజుల్లో ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్‌లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. చైనాలో వేలాది మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటున్నారు. ఆస్పతి మార్చురీల్లో శవాలు పేరుకుపోతున్నాయి. వ్యాక్సిన్లు, టెస్ట్‌ల కోసం వేలాది మంది బారులు తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన 7 రోజుల్లోనే చైనాలో లక్షా 48 వేల మందికి పాజిటివ్ తేలింది.

శ్వాసకోశ వైఫల్యాలు కూడా కోవిడ్ -19 మరణాల అధికారిక మరణాల సంఖ్యలో చేర్చనున్నట్లు చైనా తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా భారీగా కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. బీజింగ్, ఓమిక్రాన్ స్ట్రెయిన్ BF.7 వేరియంట్‌తో తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. సోమవారం మరో ఐదు మరణాలను నమోదైనట్లు చైనా ప్రకటించింది. జీరో కోవిడ్ విధానంతో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న ఒక్క రోజులోనే 4వేల 666 కేసులు నమోదయ్యాయి. చైనాలో వచ్చే మూడు నెలల్లో 60 శాతం మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ పైగెల్ డింగ్ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి చూస్తే కరోనా ఫోర్త్ వేవ్ వెరీ డేంజరస్ అని చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి

ఇండియాలోని మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఇవాళ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..