China Covid-19 cases: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో ప్రపంచం అల్లకల్లోలమైంది. ఈ మధ్యే మూడోవేవ్ ముగిసిందని.. మహమ్మారి పీడ విరగడయ్యిందని కాస్త రిలాక్సయ్యాం. అదంతా భ్రమేనని మరోసారి నిరూపితమవుతోంది. కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో కొన్నివారాలుగా నమోదవుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత వైరస్ మరణాలు సంభవించడం గమనార్హం. శనివారం కరోనాతో ఇద్దరు చనిపోయినట్లు చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. 2021 జనవరి తర్వాత చైనాలో వైరస్ మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఈ రెండు మరణాలతో కలిపి చైనాలో ఇప్పటివరకు 4,638 మంది మృతిచెందినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. మరోవైపు కొత్తగా 2,157 కేసులు నమోదయ్యాయి. ఇందులో జిలిన్ ప్రావిన్స్‌లోనే అధిక కేసులు బయటపడ్డాయి. కరోనా విజృంభణతో ఇప్పటికే చైనాలో 4 కోట్ల మంది లాక్‌డౌన్‌లోకి వెళ్లారు.
రోజురోజుకు పెరుగుతున్న కేసులతో చైనా మరింత అప్రమత్తమైంది. జీరో కొవిడ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని నెమ్మదిగా సడలించాలని నిపుణులు సూచించినా సాధ్యం కావడం లేదని చైనా ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు అధికారులు. జీరో కొవిడ్ విధానంతో తీవ్ర పరిణామాలు ఎదురైనా.. ప్రజారోగ్యమే తమకు ముఖ్యమని స్పష్టం చేస్తోంది చైనా ప్రభుత్వం.
Also Read: