Coronavirus – China: చైనాలోనే కరోనా పుట్టుక.. తెరపైకి మరికొన్ని బలమైన సాక్ష్యాధారాలు..!

|

Oct 06, 2021 | 4:25 PM

Coronavirus - China: గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.

Coronavirus - China: చైనాలోనే కరోనా పుట్టుక.. తెరపైకి మరికొన్ని బలమైన సాక్ష్యాధారాలు..!
Covid 19 Virus
Follow us on

Coronavirus – China: గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది అనాథలుగా మారిపోయాయి. మరెందరో నిరాశ్రయులయ్యారు. ఉపాధి కోల్పోయి బిచ్చగాళ్లుగా మారిపోయారు. ఇంతటి సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్ పుట్టుక చైనాలోనే జరిగిందనే ఆరోపణలంగా బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా చైనాకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లూ వచ్చిన ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఆధారంగా.. డ్రాగన్ కంట్రీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా తీరు ఆది నుంచి అనుమానాస్పదంగానే ఉంది. చాలా రోజులపాటు వైరస్‌ వ్యాప్తి విషయాన్ని కప్పిపెట్టిన చైనా.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా వైరస్ చైనాలో పుట్టిందని, కావాలనే కరోనా వివరాలను దాచి ప్రపంచాన్ని అతలాకుతలం చేశారని చాలా దేశాల అధినేతలు ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ చైనా సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి చైనానే సూత్రధారి అంటూ నిందించారు. కాగా, ఈ ఆరోపణలన్నింటికీ బలం చేకూర్చే సాక్ష్యాలు తాగా వెలుగులోకి వచ్చాయి.

చైనాలోని వుహాన్‌లో తొలికేసు వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందు నుంచే అక్కడి ల్యాబ్‌లు పీసీఆర్ పరీక్ష పరికరాలను భారీగా కొనుగోలు చేసినట్లు తేలింది. ఆస్ట్రేలియా-అమెరికాకు చెందిన ‘ఇంటర్నెట్‌ 2.0’ అనే సంస్థ పరిశోధన నిర్వహించి.. ఈ విషయాన్ని తేల్చింది. 2019 డిసెంబర్‌ 31వ తేదీన చైనా తొలిసారి కొత్త వైరస్‌ గురించి సమాచారాన్ని WHOకు అందజేసింది. జనవరి7వ తేదీన దీనిని కరోనా కొత్తరకం అయిన సార్స్‌కోవ్‌-2గా సైంటిస్టులు తేల్చారు.

అయితే, 2019లోనే వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పాలిమర్‌ చైన్‌ రీయాక్షన్‌ పరీక్షల సామగ్రిని కొనుగోలు చైనా కొనుగోలు చేసినట్లు ఈ పరిశోధన సంస్థ తెలిపింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే.. వీటి కొనుగోళ్లలో 50 శాతం వరకు పెరుగుదల ఉందని తేల్చింది. పీసీఆర్ పరికరాల కొనుగోళ్లలో పెరుగుదల ఆధారంగా.. చైనా కోవిడ్ 19 గురించి ప్రపంచానికి వెల్లడించిన దాని కంటే కొన్ని నెలల ముందే వైరస్ వ్యాప్తి ప్రారంభమై ఉండొచ్చని ఇంటర్నెట్ 2.0 ఒక అభిప్రాయపడింది. అయితే, ఈ అభిప్రాయాన్ని వైద్య నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వాదనకు భిన్నవాదం వినిపిస్తున్నారు. కేవలం పీసీఆర్‌ పరీక్ష పరికరాలు కొనుగోళ్ల ఆధారంగా ఏ నిర్ణయానికి రాలేమని అంటున్నారు నిపుణులు. వివిధ రకాల వైరస్‌లను కనుగొనడానికి పీసీఆర్ పరికరాలను వాడుతుంటారని సైంటిస్టులు చెబుతున్నారు.

కాగా, కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనాపై జరిపిన ఈ పరిశోధనకు ఇంటర్నెట్‌2.0 కో చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ రాబిన్సన్‌ నేతృత్వం వహించారు. ఈయనకు గతంలో ఆస్ట్రేలియా సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ డేటా కొవిడ్‌ పుట్టుకకు సంబంధించి ఏ వాదనను సమర్థించేందుకు కాదని ఆయన చెప్పడం గమనార్హం.

Also read:

AP Weather Alert: ఉపరితలం ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలలో భారీ వర్షాలకు ఛాన్స్..

Bigg Boss 5 Telugu: ఇదే కదా కావాల్సింది.. కెప్టెన్సీ టాస్క్‏లో కంటెస్టెంట్స్ ఫుల్ ఫైర్.. ప్రోమో చూశారా ?

Uttarpradesh: యువతకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. ఆమోదం తెలిపిన యూపీ కేబినెట్..