China Blocks WHO Team: డ్రాగన్ కంట్రీ కంత్రీపనులకు వంతపాడిన WHO చైర్మన్ తొలిసారిగా చైనా తీరుపై మండిపాటు

ఇన్నాళ్లు కరోనా పుట్టుకకి కారణం ఎవరైనా ఏ దేశమైనా తెలుసుకోవచ్చు అన్న చైనా ప్రభుత్వం.. who బృందానికి అనుమతుల జాప్యం.. డ్రాగన్ పాలకులపై తొలిసారిగా అసహనం..

China Blocks WHO Team: డ్రాగన్ కంట్రీ కంత్రీపనులకు వంతపాడిన WHO చైర్మన్ తొలిసారిగా చైనా  తీరుపై మండిపాటు
Follow us

|

Updated on: Jan 06, 2021 | 3:39 PM

China Blocks WHO Team: ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి రక్కసి కోరల్లో చిక్కుకుని అల్లలాడడానికి ప్రధాన కారణం కారణం చైనా అయితే.. ఆ వైరస్ గురించి దాని తీవ్రత గురించి సరైన అంచనా వేయకుండా డ్రాగన్ కంట్రీకి వంత పాడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటూ అమెరికా తీవ్ర స్థాయిలో విమర్శించింది. అగ్రరాజ్యంతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు కూడా చైనా తీరుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ఆ దేశాల ఆరోపణలు అవాస్తవాలు అంటూ చైనా కూడా కోవిడ్ 19 బాధిత దేశమే అంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్ అధానోమ్. అయితే తాజాగా డ్రాగన్ పాలకుల తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధనకు సిద్ధమైన సంస్థ సభ్యులకు చైనాలోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వడానికి అక్కడ పాలకులు జాప్యం చేస్తున్నారు. ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి నిపుణులు పుట్టుకపై ఎవరు పరిశోధనకోసం ఇప్పటికే చైనాకు బయలుదేరారని తెలిపారు. వారిలో ఏ ఒక్కరికీ చైనా ఇంత వరకు అనుమతులు జారీ చేయలేదని చెప్పారు.

డబ్ల్యూహెచ్‌వో, చైనా ప్రభుత్వం కలిసే నిపుణుల బృంద పర్యటనకు ఏర్పాట్లు చేసినా ఇప్పటి వరకూ బృందం సభ్యులకు తమ దేశంలో అడుగుపెట్టడానికి ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు టెడ్రోస్. చైనా ప్రభుత్వం తీరు తనను ఎంతో నిరాశకు గురి చేసిందని… అక్కడికి బయలు దేరిన బృందంలోని సభ్యుల్లో ఇద్దరు తిరిగి తమ స్వ గృహాలకు బయలు దేరారని… నిపుణులు తమ దేశంలో ప్రవేశించడానికి ఇప్పటికీ చైనా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. అసలు ఏర్పాట్ల మాటే మరిచారని ఘాటు వాఖ్యానించారు WHO చైర్మన్.

ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నట్లు కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టింది కాదని.. దాని పుట్టుకపై ఎవరు పరిశోధన చేస్తామన్నా తాను అంగీకరిస్తామని.. అలా పరిశోధన జరిపేందుకు WHO బృందానికి అనుమతులు ఇస్తామని గతంలో డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. తాము కోవిడ్ విషయంలో నిర్దోషులమంటూ పలుమార్లు అక్కడ అధికారులు ప్రకటించారు.. ఈ నేపథ్యంలో నిపుణుల బృందంతో చైనా పాలకులు ప్రవర్తిస్తున్న వివాదాస్పద తీరును చైనాను ఇన్నాళ్లు సమర్ధించిన టెడ్రోస్ అధానోమ్ సహా అందరు తప్పు పడుతున్నారు. ఇప్పటికే “తాను చైనా ప్రభుత్వంలో మాట్లాడానని.. ఈ పర్యటన డబ్ల్యూహెచ్‌వోతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఎంతో కీలకం అని తెలిపాననిని” టెడ్రోస్‌ వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని.. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..