UK Virus 41 Countries: మానవాళిపై వైరస్ లు పగబట్టాయా.. శక్తివంతమైన కొత్తవైరస్ వేగంగా వ్యాపిస్తున్నాయంటూ..

మానవాళిపై వైరస్ లు పగబట్టాయా.. ఒక వైరస్ వెనుక మరొకటి వెలుగులోకి వస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయా అంటే అవును అనే అనిపించక మానదు తాజా పరిస్థితి..

UK Virus 41 Countries: మానవాళిపై వైరస్ లు పగబట్టాయా.. శక్తివంతమైన కొత్తవైరస్ వేగంగా వ్యాపిస్తున్నాయంటూ..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 4:48 PM

UK Virus 41 Countries :మానవాళిపై వైరస్ లు పగబట్టాయా.. ఒక వైరస్ వెనుక మరొకటి వెలుగులోకి వస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయా అంటే అవును అనే అనిపించక మానదు తాజా పరిస్థితిని చూస్తుంటే… ఇప్పటికే ఏడాది నుంచి కరోనా మహమ్మారి దేశవిదేశాలలో కల్లోలం సృష్టిస్తుంటే.. తాజాగా బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం ప్రపంచదేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి బ్రిటన్‌ను వణికిస్తోన్న‌ ఈ రకం వైరస్‌ ఇప్పటికే 41దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. “బ్రిటన్‌లో మొదటి సారిగా వెలుగులోకి వచ్చిన కోవ్‌-202012/01 రకం కరోనా వైరస్‌ జనవరి 5 కి దాదాపు 41 దేశాల్లో విస్తరించిందని”.. కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. ఇక “దక్షిణాఫ్రికాలో బయటపడ్డ 501.V2 రకం వైరస్‌ స్ట్రెయిట్ కంటే మరింత శక్తి శాలి అని.. మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఈ కొత్త కరోనాకు 501 డాట్‌వీ2గా నామకరణం చేసినట్లు తెలిపింది. ఈ వైరస్ కూడా ఆరు దేశాలకు వ్యాపించిందని” ప్రపంచఆరోగ్య సంస్థ ప్రకటించింది.

కోవిడ్ 19 తో పోలిస్తే స్ట్రెయిట్ 70శాతం వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచదేశాలు బ్రిటన్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షలను మరికొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించాయి. అయితే బ్రిటన్‌ , దక్షిణ ఆఫ్రికా లో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిచింది.

వేగంగా విస్తరిస్తున్న స్ట్రెయిట్ వైరస్ బాధితులు భారత్ లో కూడా రోజు రోజుకీ అధికమవుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 71 కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచుతున్నామని కేంద్రం చెప్పింది. మరోవైపు రిపబ్లిక్ డే ఉత్సవాలను హాజరుకావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్థానిక పరిస్థితుల దృష్ట్యా విరిమించుకున్న సంగతి తెలిసిందే.

Also Read: డ్రాగన్ కంట్రీ కంత్రీపనులకు వంతపాడిన WHO చైర్మన్ తొలిసారిగా చైనా తీరుపై మండిపాటు

Latest Articles
శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు..
అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి
రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి
రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..
రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..
అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు వీరే
అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు వీరే
నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
పుచ్చకాయల సాగుతో అదిరిపోయే లాభాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో..
పుచ్చకాయల సాగుతో అదిరిపోయే లాభాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్..
అర్థరాత్రి కుక్కలను చంపిన కిరాతకుడు.. ఎందుకంటే..?
అర్థరాత్రి కుక్కలను చంపిన కిరాతకుడు.. ఎందుకంటే..?