కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన బాల కార్మికులు…..లేత ప్రాయంలోనే శ్రమకోరుస్తున్న చిన్నారులు

| Edited By: Phani CH

Jun 10, 2021 | 1:25 PM

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య పెరిగి[పోయిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన బాల కార్మికులు.....లేత ప్రాయంలోనే శ్రమకోరుస్తున్న చిన్నారులు
Child Labour
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య పెరిగి[పోయిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారిగా తిరిగి చిన్నారులు శ్రమజీవులవుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. కోట్లాది బాల కార్మికులు తమ కుటుంబ పోషణ కోసం చదువులు మాని.. (అసలు స్కూళ్ళు ఉంటే కదా) పని కోసం ఫ్యాక్టరీల వైపు, భవనాలు, ఇళ్ళు , ఇతర కట్టడాల నిర్మాణాల వైపు కదులుతున్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ తమ సంయుక్త నివేదికలో తెలిపాయి. 2020 లో వీరి సంఖ్య 160 మిళియన్లకు పైగా ఉండగా.. నాలుగేళ్లలో ఇది ఇంకా పెరిగిపోయినట్టు ఈ సంస్థలు వెల్లడించాయి. కరోనా పాండమిక్ నుంచే బాలలకు ఈ దుస్థితి ప్రారంభమైంది. 2000-2016 మధ్య వీరిసంఖ్య 94 మిళియన్లు మాత్రమే అని ఈ రిపోర్టు తెలిపింది. కోవిద్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా 10 మంది పిల్లల్లో కనీసం ఒకరు చైల్డ్ లేబర్ గా మారారు.. ముఖ్యంగా సహారా ఆఫ్రికాలో వీరి సంఖ్య మరీ అధికంగా ఉంది. నిరక్షరాస్యత, పేదరికం కూడా ఇందుకు తోడయ్యాయి అని ఈ సంస్థలు అభిప్రాయపడ్డాయి. జనాభా పెరుగుదల కూడా ఓ కారణమైంది.. పాండమిక్ రిస్క్.. పరిస్థితిని అత్యంత దారుణంగా మార్చింది.. వచ్చే రెండేళ్ల కాలంలో మరో 50 మిలియన్ల మంది బాల కార్మికులు ఈ ప్రపంచంలో తమ కుటుంబ పోషణ కోసం కష్టపడక తప్పేట్టు లేదు అని ఈ సంస్థలు అంచనా వేశాయి. వరల్డ్ వైడ్ గా బాల కార్మికుల సంఖ్యకు సంబంధించి ఇవి ప్రతి నాలుగేళ్ళకొకసారి ఈ వివరాలను తెలియజేస్తుంటాయి.

స్కూళ్ళు మూతబడ్డాయి.. కుటుంబ బడ్జెట్ ఖర్చులు పెరిగిపోయాయి.. ఈ నేపథ్యంలో కోట్లాది కుటుంబాలు తమ పిల్లలను పనికి పెడుతున్నాయి అని ఐక్యరాజ్యసమితి విచారం వ్యక్తం చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: PM Awas Yojana: గుడ్‏న్యూస్ చెప్పిన కేంద్రం.. 3.61 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండిలా..

Crime News: పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!