AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత విద్యుత్ కేంద్రాలపై చైనా సైబర్ దాడులు, నిప్పులు కక్కిన అమెరికా , చర్య తీసుకోవాలన్న ఎంపీ

భారత దేశంలోని విద్యుత్ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడులు చేయడాన్ని అమెరికా ఖండించింది.  ఈ విధమైన దాడులను సహించరాదని ఫ్రాంక్ పాలోన్ అనే ఎంపీ కోరారు.

భారత విద్యుత్ కేంద్రాలపై చైనా సైబర్ దాడులు, నిప్పులు కక్కిన అమెరికా , చర్య తీసుకోవాలన్న ఎంపీ
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 02, 2021 | 11:55 AM

Share

భారత దేశంలోని విద్యుత్ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడులు చేయడాన్ని అమెరికా ఖండించింది.  ఈ విధమైన దాడులను సహించరాదని ఫ్రాంక్ పాలోన్ అనే ఎంపీ కోరారు. ఇలాంటి తరుణంలో జోబైడెన్ ప్రభుత్వం ఇండియాకు అండగా నిలబడాలని ఆయన ట్వీట్ చేశారు. మన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు మనం ఈ సమయంలో సపోర్ట్ గా ఉండాలని అన్నారు. భారత విద్యుత్ గ్రిడ్లపై ప్రమాదకరమైన చైనా హ్యాకర్ల దాడులు గర్హనీయమని, అసలే కోవిడ్ పాండమిక్ బలంగా ఉన్న  సమయంలో చైనా చర్యల కారణంగా ఇండియాలో హాస్పిటల్స్ పని చేయక మూత పడవలసి వచ్చిందని, జనరేటర్లు సైతం పని చేయలేదని,, బైడెన్ ప్రభుత్వం ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. బలప్రయోగం, బెదిరింపుల ద్వారా చైనా ఆసియా ప్రాంతంపై డామినేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మనం అనుమతించరాదని ఫ్రాంక్ పాలోన్ కోరారు.

మసాచ్యూసెట్స్ లోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ చైనా నిర్వాకాన్ని ఎండగట్టింది. మాల్ వేర్ ద్వారా ఇండియాలోని విద్యుత్ గ్రిడ్ సిస్టంలలోకి చైనా ప్రభుత్వంతో లింక్ గల హ్యాకర్లు టార్గెట్ చేయడాన్ని ఈ సంస్థ గుర్తించింది. కాగా ఈ వార్తల గురించి తమకు కూడా తెలుసునని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మాల్ వేర్ ఉదంతంపై న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన స్టడీ వార్తను తాము కూడా చూశామన్నారు. చైనా చర్యలను సహించబోమని, సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సప్లయ్ ఛైన్ సెక్యూరిటీ ప్రాధాన్యాన్ని మేం గుర్తించామని ఆయన చెప్పారు.

అటు- చైనా హ్యాకర్లు సీరం, భారత్ బయో టెక్ సంస్థలను కూడా టార్గెట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా చైనా ఇప్పటివరకు తమ హ్యాకర్ల నిర్వాకంపై నోరు మెదపలేదు. ఇంత పెద్ద ఉదంతం జరిగి తమదేశంపై ఆరోపణలు వచించినా స్పందించలేదు.

మరిన్ని చదవండి ఇక్కడ :

Breaking News :పాకిస్తాన్ లో అత్యవసరంగా దిగిన భారత విమానం, ఎందుకంటే ?

Mother saves her four children: అపార్ట్‌మెంట్‌లో మంటలు.. తల్లడిల్లిన తల్లి గుండె.. బిడ్డల్ని కిటికీలోనుంచి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..